- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఒక్క రోజు షో దేనికోసం..?: కిషన్ రెడ్డికి బీర్ల ఐలయ్య సూటి ప్రశ్న
దిశ, తెలంగాణ బ్యూరో: దోమ తెరలు, మాస్కులు లేకుండా బీజేపీ నాయకులు మూసీకి వెళ్లాలని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..బీజేపీ నేతలు ఒక రోజు టూర్ అంటూ నాటకాలు బంద్ చేయాలని సూచించారు. మూసీలో మూడు నెలలు ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఛాలెంజ్ చేశారని, కానీ ఒక్క రోజే అంటూ షో ఎందుకు చేస్తున్నారని? మండిపడ్డారు. మూసీ పునరుజ్జీవ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి బీఆర్ఎస్‌తో కలిసి బీజేపీ కుట్ర చేస్తోందన్నారు. మూసీ బాధితులతో కలిసి ఒక రోజు రాత్రి ఉంటామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అనటం సిగ్గు చేటన్నారు. మురికి కంపులో దోమల మధ్య రోగాల బారిన పడి, విధి లేక ప్రజలు అక్కడే నివాసముంటున్నారన్నారు. ఆ ప్రజల్లో సంతోషాన్ని చూసేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. గుజరాత్ తరహాలో డెవలప్ కావొద్దని బీజేపీ నాయకులు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. సబర్మతి , నమామీ గంగే కార్యక్రమాల కోసం అక్కడ ప్రజలను ఖాళీ చేయించినప్పుడు బీజేపీ నేతలు మౌనం వహించారని గుర్తు చేశారు. గుజరాత్‌లో 40 వేల కుటుంబాలను తరలించారని, మరెందరికో పునరావాసం కల్పించకుండా మోసం చేసిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదని నొక్కి చెప్పారు. ఇప్పుడు హైదరాబాద్‌లో డెవలప్‌కు అడ్డుకోవడం సరికాదని సూచించారు. సికింద్రాబాద్, హైదరాబాద్ ప్రజలపై ప్రేమ ఉంటే కిషన్ రెడ్డి మూసీ ప్రక్షళనకు సహకరించాలని కోరారు.