Breaking News : మోమోస్‌, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై జీహెచ్‌ఎంసీ దాడులు

by M.Rajitha |
Breaking News : మోమోస్‌, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై జీహెచ్‌ఎంసీ దాడులు
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్(Hyderabad) లోని బంజారాహిల్స్ నందినగర్లో మోమోస్(Momos) తిని ఓ మహిళ మృతిచెందగా.. మరో ఇరవై మంది ఆసుపత్రుల పాలైన విషయం తెలిసిందే. కాగా ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన జీహెచ్‌ఎంసీ(GHMC) అధికారులు మంగళవారం పలు మోమోస్ సెంటర్లపై, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై దాడులు నిర్వహించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో నేడు ఒక్కరోజే 110 ప్రాంతాల్లో ఫుడ్ సేఫ్టీ(Food Safty) అధికారులు విస్తృత తనిఖీలు జరిపారు. ఆయా ప్రాంతాల్లోని ఫాస్ట్ ఫుడ్స్ సెంటర్లలో 70కి పైగా శాంపిల్స్ సేకరించారు. అనేక చోట్ల నిబంధనలకు విరుద్ధంగా సెంటర్లను నడుపుతున్నట్టు అధికారులు గుర్తించారు. చాలా వాటిలో అపరిశుభ్ర వాతావరణం మధ్యనే ఆయా పదార్థాలు తయారు చేస్తున్నట్టు తెలిపారు. నిబంధనలు పాటించని వాటికి భారీ జరిమానా విధించగా.. మరికొన్నిటిని సీజ్ చేసినట్టు సమాచారం. ఇక నందినగర్ ఘటనలో మోమోస్ సంస్థను సీజ్ చేయడంతోపాటు, యాజమనిపై కేసు నమోదు చేశారు అధికారులు. ఇకపై తరుచుగా తనిఖీలు నిర్వహిస్తామని, అలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చూస్తామని తెలిపారు.

Advertisement

Next Story