- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
GHMC: ఇక యాక్షన్ షురూ..! జోన్ల వారీగా ముగిసిన ఎంటమాలజీ సర్వే
దిశ, సిటీబ్యూరో: ప్రస్తుత వర్షాకాల సీజన్‌లో జీహెచ్ఎంసీ సీజనల్ వ్యాధుల నివారణపై పూర్తిస్థాయిలో దృష్టిసారించినట్లు సమాచారం. ఇందుకు గాను దోమల నివారణపైనే ప్రత్యేకంగా దృష్టిసారించినట్లు చెప్పవచ్చు. జీహెచ్ఎంసీ పరిధిలో దోమల నివారణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎంటమాలజీ విభాగం ఇటీవలే నగరంలో చేపట్టిన అయిదు క్యాటగిరీల సర్వే ఎట్టకేలకు ముగిసింది. సర్వే అంశాల ప్రాతిపదికన ఇక యాక్షనే తరువాయి. ముఖ్యంగా ఎంటమాలజీ విభాగం అధికారులు నగరంలోని ఆరు జోన్లలో నిర్మాణం జరుగుతున్న ప్రాంతం, ఫంక్షన్ హాళ్లు, సెల్లార్లు, ఓపెన్ ప్లాట్లు, తాళంవేసి ఉన్న ఇండ్లు అనే అయిదు అంశాల ప్రాతిపదికన ఈ సర్వేను నిర్వహించినట్లు సమాచారం.
597 హాట్‌స్పాట్‌ల గుర్తింపు..!
ఈ సర్వేలో దోమలు ఎక్కువగా వృద్ధి చెందేందుకు నీరు నిల్వ ఉండే సుమారు 597 హాట్‌స్పాట్‌లను గుర్తించినట్లు సమాచారం. ఈ హాట్‌స్పాట్‌లలో ఈ నెల 5వ తేదీ నుంచి జీహెచ్ఎంసీ స్పెషల్ యాక్షన్ ప్లాన్‌ను అమలు చేసేందుకు సిద్దమవుతుంది. ఈ యాక్షన్ ప్లాన్‌లోనే గత సంవత్సరం దోమల కాటుతో సంక్రమించే డెంగీ, మలేరియా ఇతరత్ర వ్యాధులు రెండు నుంచి మూడు కేసులు వెలుగుచూసిన కాలనీలు, బస్తీలు, మురికివాడలను ఎంపికచేసుకుని దోమల నివారణ చర్యలతో పాటు స్థానికులకు హెల్త్ క్యాంప్‌లను నిర్వహించేందుకు సిద్దమవుతుంది.
దోమల నివారణ ప్రమాణాలను పాటించాల్సిందే..
ఎంటమాలజీ విభాగం నిర్వహించిన సర్వేలో భాగంగా ఎక్కువగా దోమలు నిర్మాణం జరిగే ప్రాంతాలు, ఓపెన్ ప్లాట్లు, ఫంక్షన్ హాళ్లలోని కార్యకలాపాల వల్లే వృద్దిచెందుతున్నట్లు గుర్తించినట్లు సమాచారం. నిర్మాణం జరిగే ప్రాంతంలో నిర్మాణం చేపడుతున్న గుత్తెదారు అక్కడ నిర్మాణం పూర్తయ్యే వరకు దోమల వృద్ది కాకుండా నివారణ ప్రమాణాలను పాటించాల్సిందేనని ఎంటమాలజీ విభాగం అధికారులు సూచిస్తున్నారు. ఈ మేరకు ఈ సమాచారాన్ని సర్క్యులేట్ చేయాలని కూడా భవన నిర్మాణ అనుమతులు జారీ చేసిన టౌన్‌ప్లానింగ్ విభాగాధిపతి అయిన చీఫ్ సిటీ ప్లానర్ ద్వారా సమాచారం అందించాలని భావిస్తున్నట్లు సమాచారం. అలాగే వీటికి తోడు ఓపెన్ ఫ్లాట్లలో కూడా రోజుల తరబడి నీరు నిలుస్తుండటంతో కూడా లార్వా పేరుకుపోయి దోమలు వృద్ధి చెందుతున్నట్లు గుర్తించి, ఆ ఫ్లాటులో నీరు నిల్వకుండా యజమానే చర్యలు తీసుకోవాలన్న సమాచారాన్ని సర్క్యులేట్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇక ఫంక్షన్ హాళ్లలో ఎప్పటికప్పుడు శుభ్రత పాటించాలంటూ ఇప్పటికే శానిటేషన్ అధికారులు సూచనలిచ్చినా, కొన్ని ఫంక్షన్ హాళ్లు పాటించటం లేదన్న విషయాన్ని గుర్తించిన ఎంటమాలజీ విభాగం అధికారులు ఈ విషయంలో మరోసారి శానిటేషన్ విభాగంచే ఫంక్షన్ హాళ్లపై చర్యలకు సిద్దమవుతున్నట్లు సమాచారం.
ఒక్కో వర్కర్‌కు 500 ఇండ్లు..
అసలే వర్షాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశముండటంతో దోమల నివారణపై బల్దియా ప్రత్యేకంగా దృష్టిసారించింది. ఇందుకు గాను గత సంవత్సరం ఎక్కువగా డెంగీ, మలేరియా వంటి వ్యాధులు నమోదైన ప్రాంతాల్లోని ఎంటమాలజీ ఫీల్డు వర్కర్‌కు 500 ఇండ్లు కేటాయించి, ఆ ఇంట్లోని వారికి దోమల నివారణ, సీజనల్ వ్యాధుల బారినపడకుండా ఉండేలా అవగాహన కార్యక్రమాల నిర్వహణను లక్ష్యంగా కేటాయించారు. దీనికి తోడు సర్కిళ్ల వారీగా ఉన్న అసిస్టెంట్ ఎంటమాలజీలు కూడా తమ పరిధిలోని పాఠశాలల్లోని విద్యార్థులకు దోమల నివారణతో పాటు దోమకాటుతో సంక్రమించే వ్యాధుల బారినపడకుండా ఉండేలా పాటించాల్సిన జాగ్రత్తలపై కూడా అవగాహన పెంపొందించేలా టార్గెట్లు విధించినట్లు తెలిసింది.
ఎంటమాలజీ సర్వే వివరాలు..
కేటగిరీ ఎల్బీనగర్ ఖైరతాబాద్ శేరిలింగంపల్లి సికింద్రాబాద్ చార్మినార్ కూకట్‌పల్లి
నిర్మాణ ప్రాంతాలు 578 977 1,141 985 732 1,957
ఫంక్షన్‌హాళ్లు 111 109 51 128 286 82
సెల్లార్లు 328 1,103 1,044 1,102 464 702
ఓపెన్ ఫ్లాట్లు 873 626 1,303 1,258 520 1,157
తాళం వేసిన ఇండ్లు 1,264 1,336 1,235 1,677 876 2,312