ఓపెన్ ప్లాట్ కబ్జా చేసి విక్రయించిన ముఠా అరెస్ట్

by Kalyani |
ఓపెన్ ప్లాట్ కబ్జా చేసి విక్రయించిన ముఠా అరెస్ట్
X

దిశ, చైతన్యపురి : నకిలీ పత్రాలు, ఆధార్ కార్డులు సృష్టించి ఓపెన్ ప్లాట్ ను విక్రయించి వచ్చిన సొమ్మును పంచుకొని కటకటాల పాలైన సంఘటన మంగళవారం ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ వినోద్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం… మహమ్మద్ సాదేక్, పాషా, జనార్దన్ రెడ్డి, కోయాల్కర్ చంద్రశేఖర్, లాలాజీ శ్రీశైలం, మొహామద్ ఇమాడు ఉద్దీన్, ఉబెద్ చావోస్, మనోహర్ గౌడ్, చిన్నునాయక్ లు కలిసి ఒక ముఠాగా ఏర్పడ్డారు. బాలాపూర్ మండలం అల్మాస్ గూడ లోని సర్వే నెంబర్ 104/1 లోగల ఓపెన్ ప్లాట్ వైడ్ నంబర్ 37 చాలా కాలంగా వాడుకలో లేదు. వీరంతా కబ్జా చేయాలనే ఉద్దేశంతో అసలు ఓనర్ ఆధార్ కార్డును పోలిన నకిలీ ఆధార్ కార్డు తయారుచేసారు. అసలు ఓనర్ మాదిరిగా ఒక నకిలీ వ్యక్తిని ఎల్బీనగర్ సబ్ రిజిస్ట్రేషన్ అధికారి ముందు హాజరుపరిచి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఆప్లాట్ ను మార్కెట్ దరకు ఇతరులకు విక్రయించారు. అమ్మగా వచ్చిన సొమ్మును అందరు పంచుకున్నారు. ఈ వ్యవహారంలో రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో పనిచేస్తున్న కొంతమంది వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ మేరకు కేసు నమోదు చేసి నలుగురు వ్యక్తులను మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచినట్లు తెలిపారు. మరికొంత మంది నిందితులు పరారీలో ఉన్నారని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed