Gaddar : పాటతో ప్రజలను చైతన్య పరిచిన వ్యక్తి గద్దర్

by Sridhar Babu |
Gaddar : పాటతో ప్రజలను చైతన్య పరిచిన వ్యక్తి  గద్దర్
X

దిశ, ముషీరాబాద్ : ప్రజల సమస్యలు సమాజానికి తెలిసేలా పాటతో ప్రజలను చైతన్య పరిచిన ఉద్యమకారుడు, గాయకుడు వ్యక్తి, శక్తి గద్దర్ అని ఆయన కూతురు వెన్నెల అన్నారు. ఆల్ ఇండియా షెడ్యూల్ క్యాస్ట్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ జాతీయ అధ్యక్షుడు రాజు ఉస్తాద్ ఆధ్వర్యంలో మంగళవారం ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద గద్దర్ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గద్దర్ కూతురు వెన్నెల ముఖ్య అతిథిగా హాజరై ముందుగా అంబేద్కర్ విగ్రహానికి, అనంతరం గద్దర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వెన్నల మాట్లాడుతూ ఉద్యమకారుడు, ప్రజా గాయకుడు గద్దర్ మన మధ్యలో లేకున్నా

ఆయన పాట ఆయన మాట ఆగలేదన్నారు. ఆయన అందించిన జ్ఞానాన్ని ప్రజలందరికీ అందించి భావి తరాలకు చైతన్య దిశలో తీసుకెళ్తానని మాట ఇస్తున్నానని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో రాష్ట్రాన్ని దక్కించుకోవడానికి గద్దర్ పాట మూల స్తంభంగా నిలిచిందన్నారు. ఆయన కూతురిగా పుట్టడం తన అదృష్టం అని అన్నారు. ఆల్ ఇండియా షెడ్యూల్ క్యాస్ట్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ జాతీయ అధ్యక్షుడు రాజు ఉస్తాద్ మాట్లాడుతూ ప్రజా గాయకుడు గద్దర్ మా వర్గానికి మాకు ఎంతో పేరు తెచ్చారని అన్నారు. ప్రతి క్షణం ప్రజల కోసం ఆలోచించే వారని, ఆయన పాట ప్రజలకు ఉపయోగపడే విధంగా పాడే వారని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మాల వారియర్స్ అధ్యక్షుడు జంగా శ్రీనివాస్, బోయమని సత్యనారాయణ, చెరుకు రామచందర్, ఉత్తమ్ సుమన్, కే.వీ.ఎస్.రాజు, మద్దెల ప్రభాకర్, కనకయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story