బుక్​ఫెయిర్​లో ఆకట్టుకుంటున్న దిశ స్టాల్

by Sridhar Babu |   ( Updated:2024-02-09 16:55:16.0  )

దిశ, ముషీరాబాద్ : నగరంలోని తెలంగాణ కళాభారతి (ఎన్టీఆర్ స్టేడియం)లోని గద్దర్ ​ప్రాంగణంలో 36వ హైదరాబాద్​ జాతీయ పుస్తక మహోత్సవం శుక్రవారం మొదలైంది. బుక్​ఫెయిర్​లో ఏర్పాటు చేసిన దిశ తెలుగు దినపత్రిక స్టాల్​ను ఎడిటర్​ మార్కండేయ ప్రారంభించారు. ఈ సందర్భంగా సందర్శకులకు, పాఠకులకు ఆయన దిశ దినపత్రికను ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో దిశ నెట్​వర్క్ ​ఇన్చార్జీ ప్రవీణ్​కుమార్, అడ్వర్టైజ్​మెంట్​ హెడ్​ ప్రదీప్, అడ్మినిస్రేషన్​ మేనేజర్​ సురేష్​శర్మ, టెక్నికల్​హెడ్ ​అనుకరణ్, సంపత్​​రెడ్డి తదితర సిబ్బంది పాల్గొన్నారు.

Also Read..

TS: గ్రూపు-4 ఫలితాలు విడుదల.. స్తంభించిన వెబ్‌సైట్

Advertisement

Next Story