లలితాదేవిగా జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి దర్శనం.

by Aamani |
లలితాదేవిగా జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి దర్శనం.
X

దిశ, జూబ్లీహిల్స్: దేవీ ఉపాసకులకు ముఖ్య దేవత. త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపంలో ఐదో రోజున లలితాదేవి రెండవ శక్తి గా సోమవారం జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి దర్శనమిచ్చారు. లక్ష్మీ సరస్వతులు ఇరువైపులా నిలబడి వింజామరలు వీస్తుండగా శ్రీచక్ర అధిష్ఠాన శక్తిగా కొలువుతీరింది. చెరుకుగడ, విల్లు, పాశాంకుశాలను ధరించి భక్తులకు వరాలిస్తుంది. లలితాదేవి విద్యా స్వరూపిణి. మాంగల్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. దేవి అనుగ్రహం కోసం సువాసినీ పూజ చేయాలి. సమస్త సుఖాలు ప్రసాదించే శక్తి స్వరూపిణి లలితాదేవి ని ప్రసన్నం చేసుకునేందుకు భక్తులు సోమవారం అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed