- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సిటీలో డ్రగ్స్ వినియోగంపై సీపీ సంచలన నిర్ణయం
దిశ, హైదరాబాద్ బ్యూరో: జీహెచ్‌ఎంసీ పరిధిలో ఎన్‌పీఎస్ డ్రగ్‌ను పూర్తిగా నిర్మూలించే వరకు ఎక్సైజ్ ఎన్ ఫోర్స్‌మెంట్ టీంల దాడులు కొనసాగుతాయని డైరెక్టర్ వీబీ కమలాసన్‌రెడ్డి ప్రకటించారు. నాంపల్లిలోని ఎక్సైజ్ కార్యాలయంలో గురువారం జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ యేడాది జనవరి నుండి ఆగస్టు వరకు ఎన్ ఫోర్స్‌మెంట్, ఎస్ టి ఎఫ్, ఇతర టీంల పనితీరును సమీక్షించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ధూల్‌పేట్ ఎక్సైజ్ పోలీసుల కంట్రోల్‌లో ఉందని, గంజాయి అమ్మకాలు 95 శాతంగా నిలిచి పోయాయన్నారు. ఈ సందర్భంగా ధూల్‌పేట్ ఇంచార్జీ ఎన్.అంజి రెడ్డి, సీఐలు మధుబాబులు చాల మంది గంజాయి అమ్మకం దార్లు జైళ్లలో ఉన్నారని డైరెక్టర్‌కు వివరించారు. ధూల్‌పేట్‌లో ఇదే పద్దతిలో గంజాయి పూర్తిగా నిర్మూలించే వరకు నిరంతరందాడులు, తనిఖీలు చేపట్టాలని డైరెక్టర్ వారికి తెలిపారు. మిగిలిన టీమ్‌లు ఎన్‌డీపీఎస్‌ను లక్ష్యంగా నిరంతరం తనిఖీలు చేపట్టి డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపాలని అదేశించారు. గంజాయి అమ్మకందార్లలో పరివర్తన చెందిన వారిని బైండోవర్ చేయాలని సూచించారు. నిజమైన నిందితుల పట్ల కఠినంగా వ్యవహరించాలని, ఎక్సైజ్ దాడులతోపాటు స్థానిక పోలీసుల సహకారంతో జాయింట్ తనిఖీలు, దాడులు నిర్వహించాలన్నారు. పట్టుబడిన కేసుల్లో శిక్షలు పడే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కమిషనర్ ఖురేషి, డిప్యూటి కమిషనర్ శాస్త్రీ, అసిస్టేంట్ కమిషనర్ అనిల్ కుమార్‌రెడ్డి, ప్రణవి, అడిషనల్ ఎస్పీ భాస్కర్, ఎక్సైజ్ సూపరిండెంట్లు ప్రదీప్‌రావు, అంజి రెడ్డి, డీఎస్పీలు తుల శ్రీనివాసరావు, తిరుపతి యాదవ్ ఇతరులు పాల్గొన్నారు.