కాంగ్రెస్ బిగ్ ప్లాన్.. హస్తం గూటికి భారీగా ఎమ్మెల్యేలు..!

by srinivas |   ( Updated:2024-11-22 15:44:31.0  )
కాంగ్రెస్ బిగ్ ప్లాన్.. హస్తం గూటికి భారీగా ఎమ్మెల్యేలు..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైకోర్టు ఇచ్చిన తీర్పుతో కాంగ్రెస్‌లో జోష్ వచ్చింది. ఈ జోష్‌తో మరికొంత మంది ఎమ్మెల్యేలు పార్టీలోకి వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. కాంగ్రెస్‌లోకి మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వస్తారంటూ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్వయంగా ప్రకటించారు. హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు పార్టీకి కొంత ఇబ్బందికరంగా మారినా తాజాగా డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పుతో ఉత్సాహం నెలకొంది. హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పుతో త్వరలోనే పార్టీలో త్వరలో చేరికలు ఉంటాయని పార్టీ నాయకులు దీమాగా ఉన్నారు. హైదరాబాద్ , రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికలు ఉంటాయని చెబుతున్నారు. ఎమ్మెల్యేలతో పాటుగా మరికొందరు ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్‌లో చేరుతారని వారంటున్నారు. గతంలో కొందరితో సంప్రదింపులు జరిపినప్పుడు వివిధ కారణాలతో వారు ముందుకు రాలేదని చెబుతున్నారు.

కానీ ఇప్పుడు కోర్టు తీర్పుతో స్పీకర్ నిర్ణయమే తుది నిర్ణయమని చెబుతున్న తరుణంలో పార్టీ మారాలనుకుంటున్న వారిలో దీమా పెరిగిందని చెబుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా రాకపోవడం, ఆ తరువాత ఎమ్మెల్యేలు, కీలకమైన నేతలు కేశవరావు, పోచారం లాంటి వారు పార్టీ మారడంతో ఒక్క సారిగా పార్టీ శ్రేణులు షాక్‌కు గురయ్యాయి. ఆ తరువాత సింగిలి బెంచ్ తీర్పు, రాజకీయ పరిణామాలు మారడం తదితర కారణాలతో కాంగ్రెస్‌లో చేరికలు నెమ్మదించాయి. ఇక చేరికల వేగం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. పార్టీ పిరాయింపులపై బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో రకంగా వ్యవహరించడం సరికాదని విమర్శిస్తున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 40 వరకు ఎమ్మెుల్యేలు కాంగ్రెస్, టీడీపీ, వైఎస్ఆర్ సీపీ, ఇతర పార్టీల నుంచి చేరారు. కానీ వారిలో ఎవ్వరిపై నా కూడా అనర్హత వేటు పడలేదు. కానీ ఇప్పుడు మాత్రం అందుకు విరుద్దంగా వ్యవహరించడం నైతికంగా సరికాదని రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు. తమకు మొదటి నుంచి చట్టం, న్యాయస్థానాలపై గౌరవం ఉందని చెబుతున్నామని, ఇప్పుడు తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందని చెబుతున్నారు. ఎమ్మెల్యేల అనర్హత తీర్పు ఆధారంగా ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలని వేచి చూశారు. కానీ ఎమ్మెల్యేలపైనే చర్యలకు ఆదేశాలు రాకపోవడంతో ఉపరిపిల్చుకున్నారు.

పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పుతో భారత రాష్ట్ర సమితి షాక్ గురైంది. పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేలపై హైకోర్టు స్పీకర్ కు ఆదేశాలు ఇస్తుందని, టైం ఫ్రేమ్ ఇస్తుందని ఆశీంచిన నిరాశే ఎదురైంది. దీంతో సుప్రీంకోర్టు కు వెళ్లాలని ఆలోచన చేస్తున్నట్లుగా సమాచారం. హైకోర్టు ఇచ్చిన తీర్పును ఉటంకిస్తూ వాదనలు కొనసాగించిన వారికి సానుకూల తీర్పు రాకపోవడంతో నిరాకకు గురయ్యారు. ఇప్పటికే పది మంది ఎమ్మెల్యేలు పార్టీ పిరాయించారు. ఎనిమిది మంది వరకు ఎమ్మెల్సీలు పార్టీ మారారు. పార్టీ మారిన వారిపై ఏలాగైన చర్యలు తీసుకోవాలని పట్టుదలతో బీఆర్ఎస్ ఉంది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసేందుకు బీఆర్ఎస్ సిద్దమవుతోందని సమాచారం. అనర్హత పిటిషన్ లపై గతంలో ఢిల్లికి వెళ్లినప్పుడు అనర్హత పిటిషన్ పై న్యాయవాదితో మాట్లాడామని స్వయంగా కేటీఆర్ వెల్లడించారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తిని సంప్రదించారు. హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు కనుక వ్యతిరేకంగా వస్తే సుప్రీంకోర్టుకు వెళ్లాలని గతంలో బీఆర్ఎస్ నేతలు ప్రకటించారు. ఈ తీర్పు నేపథ్యంలో స్పీకర్‌కు నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నామని పార్టీ వర్గాలు చెబుతున్నారు. స్పీకర్ నిర్ణయం ఆలస్యమైతే సుప్రీంకోర్టుకు వెళ్లే విషయాన్ని ఆలోచిస్తామని పార్టీ నేతలు చెబుతున్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, కల్వకుంట్ల సంజయ్, కాలే యాదయ్య, పోచారం శ్రీనివాస్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, అరికపూడి గాంధీ, ప్రకాశ్ గౌడ్, కృష్ణమోహన్ రెడ్డిలు చేరారు. బస్వరాజు సారయ్య, భాను ప్రసాద్, యెగ్గె మల్లేషం, బి.దయానంద్, దామోదర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెఎస్ ప్రభాకర్, దండె విఠల్‌లు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. ముగ్గురు ఫిరాయింపులపై కోర్టు అనుకూలంగా తీర్పు ఇస్తే మిగిలిన వారికి అదే తీర్పు వస్తుందని, దాని కోసం బీఆర్ఎస్ వేచి చూసింది. కానీ వారికి నిరాశే ఎదురైంది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు ద్వారా ఇంకా ఎక్కువ సంఖ్యలో ఎమ్మెల్యేలు వెళ్లకుండా చేయగలిగామని బీఆర్ఎస్ ముఖ్య నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed