- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
20 నిమిషాల కాల వ్యవధిలోనే కేసును ఛేదించిన పోలీసులు..
దిశ, జూబ్లిహిల్స్ : జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏప్రిల్ 14వ తేదీన వెంకటగిరిలోని కేకే వైన్స్ బయట నిలుచున్న బి.వెంకటేష్ అనే వ్యక్తి మెడలో వున్న 10 గ్రాముల బంగారు గొలుసును రంజిత్, షేక్ శర్పుద్దిన్ ఇద్దరు చైన్ స్నాచర్‌లు గొలుసు లాక్కుని పోయారు. వెంటనే అప్రమత్తం అయిన బాధితుడు జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చెయ్యగా రంగంలోకి దిగిన డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ బి.శ్రీనివాస్, ఎస్సై ఎన్.నర్సింగ్ రావు, హెచ్ జి పి.సురేష్ ముగ్గురు అధికారులు త్వరితగతంగా క్రైమ్ స్పాట్, ఇతర ఆధారాలను అంచనా వేసి నిందితులు తప్పించుకునే ఆస్కారం లేకుండా, నేరం జరిగిన 20 నిమిషాల కాలవ్యవధిలోనే ఇద్దరు చైన్ స్నాచర్‌లను పట్టుకున్నారు.
అనంతరం వారి నుండి సుమారు 10 గ్రాముల బంగారు గొలుసును స్వాధీనం చేసుకుని బాధితులకు అప్పగించిన పోలీసుల అసాధారణ నైపుణ్యం & అంకితభావానికి సిటీ పోలీస్ కమిషనర్ సీవి.ఆనంద్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ బి. శ్రీనివాస్, ఎస్సై నర్సింగ్ రావు, సురేష్ హెచ్ జి లను అభినందించి వారికి నగదు రివార్డ్ ప్రకటించారు.