- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కమిషనర్ యాక్షన్ స్టార్ట్.. అడ్వర్టైజ్‌మెంట్ విభాగం స్వీకరణ
దిశ, సిటీ బ్యూరో: జీహెచ్ఎంసీ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన పక్షం రోజులకే ఆమ్రపాలి యాక్షన్ మొదలెట్టారు. సాధారణంగా జీహెచ్ఎంసీకి కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన అధికారులు నెల నుంచి రెండు నెలల పాటు వివిధ విభాగాల వారీగా అబ్జర్వేషన్ చేసిన తర్వాత చర్యలు మొదలుపెడతారు. కానీ గతంలో జీహెచ్ఎంసీలో అదనపు కమిషనర్‌గా, గత నెల 13రోజుల పాటు ఇన్ చార్జి కమిషనర్ గా వ్యవహరించిన అనుభవం ఆమ్రపాలికి కలిసొచ్చిందనే చెప్పవచ్చు. గురువారం వరకు అడ్వర్టైజ్ మెంట్ విభాగం అదనపు కమిషనర్ సత్యనారాయణ పర్యవేక్షిస్తుండగా, తాజాగా ఆయన నుంచి ఆ విభాగాన్ని ఆమ్రపాలి తన పరిధిలోకి తీసుకున్నట్లు సమాచారం.
జీహెచ్ఎంసీకి ఆదాయాన్ని సమకూర్చే వనరుల్లో ఒకటైన అడ్వర్టైజ్ మెంట్ విభాగంలో భారీగా అవకతవకలు జరిగాయంటూ కొద్ది రోజులుగా వివిధ పార్టీల కార్పొరేటర్లు ఆరోపణలు చేసిన నేపథ్యంలో మూడు నెలల ముందు జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఇదే విషయంపై రభస జరగడంతో విచారణ చేసి, వాస్తవాలను వెలికితీసేందుకు గాను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మజ్లీస్ పార్టీల నుంచి ఇద్దరు కార్పొరేటర్ల చొప్పున ఎనిమిది మంది కార్పొరేటర్లతో అడ్ హాక్ కమిటీని నియమించారు. అడ్వర్ టైజ్ మెంట్ల విభాగంలో అవినీతి జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో ఆ అవినీతి కూపీ లాగేందుకే కమిషనర్ అడ్వర్ టైజ్ మెంట్ విభాగాన్ని తన పరిధిలోకి తీసుకున్నట్లు సమాచారం. అంతేగాక, ఈ విభాగాన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి, జీహెచ్ఎంసీ మరింత ఆదాయం వచ్చేలా సంస్కరణలు తేవాలని భావిస్తున్నట్లు సమాచారం. దీనికి తోడు అడ్వర్టైజ్ మెంట్ విభాగానికి సంబంధించి కొత్త పాలసీ తేవాలని కమిషనర్ యోచిస్తున్నట్లు సమాచారం.
బదిలీలపై నజర్
జీహెచ్ఎంసీలో ఒకే చోట, ఒకే విభాగంలో మూడేళ్ల విధి నిర్వహణను పూర్తి చేసుకున్న ఉద్యోగులకు స్థానచలనం కల్గించేందుకు గత కమిషనర్ రోనాల్డ్ రోస్ సర్కిళ్ల వారీగా ఉద్యోగుల వివరాలను సేకరించి, ట్రాన్స్ ఫర్ల జాబితాను సిద్ధం చేశారు. ఈ విషయంపై ఆరా తీసిన కమిషనర్ త్వరలోనే ఈ బదిలీల విషయంపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. దీనికి తోడు డిప్యూటేషన్ల గడువు ముగిసిన అధికారులు, రిటైర్డు అయిన తర్వాత కూడా జీహెచ్ఎంసీలోని వివిధ విభాగాల్లో ఆయా హోదాల్లో కొనసాగుతున్న ఆఫీసర్ల వివరాలను కూడా కమిషనర్ సేకరిస్తున్నట్లు సమాచారం. ఈ నెలాఖరులోపు ఆమె ఈ బదీలలు, లాంగ్ స్టాండింగ్ లతో పాటు రిటైర్డు అయి కొనసాగుతున్న అధికారులు, ఉద్యోగులపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు సమాచారం.