- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొత్తపేట "కృతింగా" బిర్యానీలో బొద్దింకలు
దిశ, చైతన్యపురి : అధికారుల అలసత్వం, విధుల పట్ల నిర్లక్ష్యం, నెలసరి మామూలు, దావతులకు బిర్యానీ ప్యాకెట్లు… ఇవన్నీ వెరసి జిహెచ్ఎంసి ఫుడ్ సేఫ్టీ అధికారుల తీరును స్పష్టంగా కనిపిస్తుంది. తనిఖీలు చేయకపోవడం మూలంగా రెస్టారెంట్ల యజమానులు ఆడిందే ఆట పాడిందే పాటగా తయారైంది. ఒకప్పుడు హైదరాబాద్ బిర్యానీ అంటే బ్రాండ్ ఇమేజ్ ఉండేది. ఎక్కడి నుండైనా వచ్చి హైదరాబాద్ లో బిర్యాని తిని వెళితే సంతోషంగా ఉండేవారు. కానీ ఇప్పుడు హైదరాబాదులో బిర్యాని తినాలంటే జనాలు భయపడుతున్నారు. ఏహోటల్, రెస్టారెంట్ కు వెళ్లినా బిర్యానీలో బొద్దింకలు దర్శనమిస్తున్నాయి. ఇలాంటి సంఘటనలు హైదరాబాద్ నగరంలో రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితులలో బిర్యానీ బ్రాండ్ కన్న బొద్దింకలు ప్రత్యక్షం కావడంతో బిర్యానీ ప్రియులు ఖంగుతింటున్నారు.
తాజాగా బుధవారం ప్రముఖ రెస్టారెంట్ అయిన కృతింగా రెస్టారెంట్ లో బిర్యానీలో బొద్దింక ప్రత్యక్షం కావడం హాట్ టాపిక్ గా మారింది. కొత్తపేట లోని కృతింగా రెస్టారెంట్ లో వనస్థలిపురం కు చెందిన సందీప్ తన ముగ్గురు స్నేహితులతో కలిసి బిర్యానీ తినడానికి బుధవారం మధ్యాహ్నం రెస్టారెంట్ కు రావడం జరిగింది. కస్టమర్ బిర్యానీ ఆర్డర్ ఇవ్వగా బిర్యానీలో బొద్దింక రావడంతో ఖంగుతిన్నాడు. ఇదేమిటని మేనేజర్ జానకిరామ్ ను ప్రశ్నించగా దురుసుగా, నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో జిహెచ్ఎంసి ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారి సన్నీకి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న సదరు అధికారి 15 నిమిషాల్లో వస్తున్నాననిచెప్పి ఎంతకీ తిరిగి రాకపోవడంతో తిరిగి కస్టమర్ మళ్ళీ ఫోన్ చేశాడు.
సదరు అధికారి ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉండగా చేసేది లేక ఆందోళన చేపట్టాడు. క్షేత్ర స్థాయిలో సిబ్బంది తనిఖీలు నిర్వహించకపోవడం వల్ల ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయని ప్రజలు చర్చించుకుంటున్నారు. గత మాసంలో అల్కాపురి లక్కీ రెస్టారెంట్ లో ఇదే సంఘటన జరిగినా అధికారులు చర్యలు మాత్రం శూన్యం. దిశ ప్రతినిధి రెస్టారెంట్ లోపలికి వెళ్లి చూడగా ఆహార పదార్థాలు, అపరిశుభ్రంగా ఉన్న కిచెన్ గది, నాణ్యత, మార్కెట్లో పేరులేని ఆయిల్ డబ్బాలు దర్శనమిచ్చాయి. అనునిత్యం ఎదో ఒక హోటల్ లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్న అధికారులలో మాత్రం ఎటువంటి చలనం లేదని వాపోతున్నారు. తూతూ మంత్రంగా తనిఖీలు, కఠిన చర్యలు లేకపోవడమే ఇందుకు కారణం అని బిర్యానీ ప్రియులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.