Career Pedia Edutech Limited : మాదాపూర్‌లో నమ్మించి మోసం చేసిన కోచింగ్ కం సాఫ్ట్‌వేర్ సంస్థ

by Sumithra |   ( Updated:2024-11-05 08:07:26.0  )
Career Pedia Edutech Limited : మాదాపూర్‌లో నమ్మించి మోసం చేసిన కోచింగ్ కం సాఫ్ట్‌వేర్ సంస్థ
X

దిశ, శేరిలింగంపల్లి : తమ వద్ద కోచింగ్ తీసుకుంటే మంచి ఐటీ కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని అమాయకులను నమ్మించి వారి వద్ద నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూళ్లు చేసిన కోచింగ్ కం సాఫ్ట్‌వేర్ సంస్థ (Coaching Co software company) మోసం చేసింది. మాదాపూర్ పోలీసు స్టేషన్(Madapur Police Station) పరిధిలోని ఏ అండ్ ఏ లేక్ ఫ్రంట్ (A&A Lakefront) మొదటి అంతస్తులో కెరియర్ పీడియా ఎడ్యుటెక్ లిమిటెడ్ (Career Pedia Edutech Limited)పేరుతో కోచింగ్ కం సాఫ్ట్‌వేర్ కంపెనీ ఏర్పాటు చేశారు. మూడు బ్యాచ్ లుగా విభజించి ఒక్కో బ్యాచ్ లో 70 మంది స్టూడెంట్స్ చొప్పున చేర్చుకున్న కంపెనీ నిర్వాహకులు వారికి కోచింగ్ ఇచ్చారు. ఇందుగా ఒక్కొక్క స్టూడెంట్ వద్ద నుండి రూ. లక్ష నుండి రూ. 1,50,000 వరకు వసూలు చేశారు. కెరియర్ పీడియా ఎడ్యుటెక్ లిమిటెడ్ కంపెనీ నిర్వాహకులు.

డబ్బులు కట్టలేని వారికి కెరియర్ పీడియా ఎడ్యుటెక్ లిమిటెడ్ సంస్థ నిర్వాహకులే కొన్ని ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ(private finance company)లతో టయ్యప్ అయి స్టూడెంట్స్ కి లోన్లు ఇప్పించి మరీ డబ్బులు వసూలు చేసినట్లు బాధితులు చెబుతున్నారు. అలా ట్రైనింగ్ పూర్తి చేసుకున్న వారికి మూడు నెలల్లో ఉద్యోగాలు ఇస్తామని భరోసా ఇచ్చారు. అయితే ట్రైనింగ్ పూర్తయి మూడు నెలలు గడిచిపోయినా ఉద్యోగాలు కల్పించలేదు. అటు తమ వద్ద తీసుకున్న లోన్లు కట్టాలని ఫైనాన్స్ కంపెనీ నుంచి ఒత్తిడి పెరిగిపోయింది. కంపెనీ నిర్వాహకులను ప్రశ్నిస్తే వారి వద్ద నుండి సరైన సమాధానం లేదు. మోసపోయామని తెలుసుకున్న బాధితులు కెరియర్ పీడియా ఎడ్యుటెక్ లిమిటెడ్ పై మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story