సీఎంఆర్ఎఫ్ స్కాం.. హైదరాబాద్ లోని 10 ఆస్పత్రులపై కేసులు

by Nagam Mallesh |
సీఎంఆర్ఎఫ్ స్కాం.. హైదరాబాద్ లోని 10 ఆస్పత్రులపై కేసులు
X

దిశ, హైదరాబాద్ బ్యూరోః సీఎంఆర్ఎఫ్ లో జరిగిన స్కామ్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. రంగంలోకి దిగిన సీఐడి కఠిన చర్యలు మొదలు పెట్టింది. నకిలీ బిల్లులు పెట్టి ప్రభుత్వాన్ని మోసం చేశారంటూ తెలంగాణలోని పలు ఆస్పత్రులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇందులో హైదరాబాద్ కు చెందిన 10 టాప్ హాస్పిటల్స్ ఉన్నాయి. సీఎంఆర్ఎఫ్ పథకం కింద రియంబర్స్ మెంట్ కోసం హాస్పిటల్స్ సిబ్బంది, స్థానికులు, కొంతమంది అధికారులు కుమ్మక్పై నకిలీ బిల్స్ సమర్పించి గత ప్రభుత్వం హయాంలో పెద్ద మొత్తంలో గోల్ మాల్ చేసినట్లు సెక్షన్ ఆఫీసర్ డీఎస్ఎన్ మూర్తి సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. స్పందించిన సీఎం రేవంత్ సీఐడి ద్వారా విచారణకు ఆదేశించారు. ఈ మేరకు సీఐడీ అధికారులు తీగ లాగితే డొంక కదిలింది . హైదరాబాద్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్‌లోని పలు ఆసుపత్రులపై తెలంగాణ నేర పరిశోధన విభాగం (సీఐడీ) విచారణ అనంతరం అందిన నివేదికల ప్రకారం ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసింది. వ్యక్తిగత లాభం కోసం మోస పూరిత బిల్లులు సమర్పించి నిధులను కాజేశారని తేలడంతో ఆయా ఆస్పత్రులపై అధికారులు కేసులు నమోదు చేశారు.

హైదరాబాద్ లోని సీఐడీ కేసులు నమోదు చేసిన ఆస్పత్రులు ఇవే..

1.అరుణ శ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ఐఎస్ సదన్ చౌరస్తా 2.శ్రీ కృష్ణ హాస్పిటల్, సైదాబాద్ 3.జననీ హాస్పిటల్, సైదాబాద్ 4.హిరణ్య హాస్పిటల్, మీర్‌పేట్ 5.డెల్టా హాస్పిటల్, హస్తినాపురం, 6.శ్రీ రక్ష హాస్పిటల్, బీఎన్ రెడ్డి నగర్ 7.ఎంఎంఎస్ హాస్పిటల్, సాగర్ రింగ్ రోడ్ 8.ఏడీఆర్ఎం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, శారదానగర్ 9. ఎంఎంవీ ఇందిరా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, కొత్తపేట 10. శ్రీ సాయి తిరుమల హాస్పిటల్, బైరామల్ గూడ.

Next Story

Most Viewed