CM meeting : ఆగస్టు 2న పదోన్నతి పొందిన 30 వేల మంది టీచర్లతో సీఎం సభ

by Sridhar Babu |
CM meeting : ఆగస్టు 2న పదోన్నతి పొందిన 30 వేల మంది టీచర్లతో సీఎం  సభ
X

దిశ, హైదరాబాద్ బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా పదోన్నతి పొందిన ఉపాధ్యాయులతో ఆగస్టు 2వ తేదీన ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ ఏర్పాట్లను పగడ్బందీగా చేపట్టాలని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం ఆయన జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఇతర అధికారులతో కలిసి సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో దాదాపు 30 వేల మంది పదోన్నతి పొందిన ఉపాధ్యాయులతో ఆగస్టు 2న మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఎల్బీ స్టేడియంలో సభ జరగనున్నందున ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని అన్నారు. ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా వివిధ

జిల్లాల నుండి వచ్చే బస్సుల పార్కింగ్ కు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇందుకు నిజాం కళాశాల, ఎన్టీఆర్ స్టేడియం తదితర స్థలాలను పరిశీలించాలని జిల్లా కలెక్టర్, ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్ ను కోరారు. సభా ప్రాంగణంను క్లీనింగ్, శానిటేషన్ పనులు చేపట్టాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో హైదరాబాద్ సీపీ కె. శ్రీనివాస్ రెడ్డి, అడిషనల్ సీపీ విక్రమ్ సింగ్ మాన్, రాష్ట్ర ఎస్సీ డెవలప్మెంట్ ముఖ్య కార్యదర్శి ఎన్.శ్రీధర్, ట్రైబల్ వెల్ఫేర్ శాఖ కార్యదర్శి ఏ.శరత్, ఆర్ అండ్ బీ, ట్రాన్స్ పోర్ట్ జాయింట్ సెక్రటరీ ఎస్.హరీష్, ఆయేషా మసరత్ ఖాన్​, స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఎండీ సోనీ బాలాదేవి , ట్రాఫిక్ అడిషనల్ సీపీ విశ్వ ప్రసాద్, వెంకట నరసింహారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed