Ts News: కొల్లపూర్‌కు నిధుల విడుదల.. మాట నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్

by srinivas |
Ts News: కొల్లపూర్‌కు నిధుల విడుదల.. మాట నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్
X

దిశ, వెబ్ డెస్క్: సీఎం కేసీఆర్ కొల్లాపూర్ ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చారు. ఇటీవలకాలం సీఎం కేసీఆర్ కొల్లాపూర్‌లో పర్యటించారు. ఆ సందర్భంగా నిర్వహించిన సభలో కేసీఆర్ మాట్లాడుతూ కొల్లాపూర్ అభివృద్ధికి నిధులు విడుదల చేస్తామని చెప్పారు. ఇచ్చిన హామీ ప్రకారం ఆయన తాజాగా ఫండ్స్ రిలీజ్ చేశారు. కొల్లాపూర్ అభివృద్ధికి రూ.44.80 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కొల్లపూర్ పరిధి 132 పంచాయతీలకు రూ.15 లక్షల చొప్పున నిధులు విడుదల చేశారు. కొల్లాపూర్ మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు మంజూరు చేశారు. దీంతో కొల్లాపూర్ బీఆర్ఎస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఇచ్చిన మాటపై నిలబడే వ్యక్తి సీఎం కేసీఆర్ అంటూ కొనియాడారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌దేనంటూ ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

Next Story