- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
శంషాబాద్ ఘాన్సీమియాగూడలో చిరుత కలకలం..!
దిశ, వెబ్‌డెస్క్: శంషాబాద్ విమానాశ్రయంలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. పశువులపై చిరుత దాడి చేయడంతో స్థానికులను భయాందోళనలో గురి చేస్తుంది. గ్రామంలో వ్యవసాయంపై ఆధారపడే తాము పొలం వెళ్లాలంటే ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకొని వెళ్లాల్సి వస్తుందని, కాగా వెంటనే అటవీశాఖ సిబ్బంది చిరుతను పట్టుకోవాలని గ్రామస్థులు అధికారులను కోరారు. దీంతో అధికారులు 20 ట్రాప్ కెమెరాలు, రెండు బోన్లు ఏర్పాటు చేశారు. కానీ చిరుత ఇప్పటివరకు ట్రాప్ కెమెరాలకు కూడా చిక్కలేదని అధికారులు చెబుతున్నారు. కాగా గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అలాగే ఎయిర్ పోర్టు పరిసరాల్లో చిరుతపులి సంచరిస్తోందని దీంతో విమానాశ్రయ సిబ్బంది అధికారులకు కూడా అటవీశాఖ సిబ్బంది సమాచారం అందించింది. మరోవైపు శంషాబాద్ ఘాన్సీమియాగూడలోని సమీపంలో చిరుత నీరు తాగినట్లు ఆనవాళ్లను గుర్తించామని, అయినా అటవీ శాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.