దాడి చేసిన ఎమ్ఐఎమ్ కార్పొరేటర్ పై కేసు నమోదు

by S Gopi |
దాడి చేసిన ఎమ్ఐఎమ్ కార్పొరేటర్ పై కేసు నమోదు
X

దిశ, బహదూర్ పురా: బూతులు తిడుతూ దాడులకు పాల్పడిన రామ్నాస్ పుర కార్పొరేటర్ మహమ్మద్ ఖాదర్ పై కాలాపత్తర్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న రాత్రి కాలాపత్తర్ లోని మోచి కాలనీలో బీజేపీ సభపై కార్పొరేటర్ తన అనుచరులతో కలిసి దాడికి పాల్పడ్డట్టు పోలీసులు తెలిపారు. కుర్చీలు పగలగొట్టి అసభ్య పదజాలంతో దూషించారని బీజేపీ నాయకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కార్పొరేటర్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ తోపాటు ఐపీసీ 341, 504, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బీజేపీ నాయకులను నెట్టేసిన కాలాపత్తర్ సిఐపై చర్యలు తీసుకోనున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed