సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఏర్పాట్లను పరిశీలించిన బీజేపీ ప్రతినిధులు..

by Sumithra |
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఏర్పాట్లను పరిశీలించిన బీజేపీ ప్రతినిధులు..
X

దిశ, మెట్టుగూడ : ప్రధానినరేంద్ర మోడీ ఈ నెల 8న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు రానున్న నేపద్యంలో రైల్వే అధికారులు ఆధ్వర్యంలో జరుగుతున్న ఏర్పాట్లను మంగళవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర రావు, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డిలు పరిశీలించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ రెండు రాష్ట్రాల అభివృద్ధి కోసం మోడీ ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. బీజేపీకి ప్రజలు పట్టం కట్టార లేదా అనేది పక్కన బెట్టి అభివృద్ధి కోసం మోడీ కట్టుబడి ఉన్నారని అన్నారు. ఈ నెల 8న మోడీ 10 వేల కోట్ల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభం చేయబోతున్నారు.

రెండో వందే భారత్ ట్రైన్ లను ప్రారంభించనున్నారని పేర్కొన్నారు. అభివృద్ధి పనులకు రాష్ట్రప్రభుత్వము సహకరించడం లేదు, అయినా కేంద్రం అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు. అభివృద్ధిని బీఆర్ఎస్ నాయకులు నాయకులు జీర్ణించుకోలేక పోతున్నారు. అందుకే కేంద్రం పై బురద జల్లే కార్యక్రమం పెట్టుకున్నారని ఆరోపించారు. రెండవ దశ ఎంఎంటీఎస్ పనులకు కూడా రాష్ట్రప్రభుత్వం సహకరించడం లేదు, రాష్ట్రప్రభుత్వ వాటా నిధులను ఇవ్వకపోయినా మోడీ ప్రభుత్వ నిధులతో పనులను ప్రారంభిస్తున్నట్లు వివరించారు. వందేబారత్ రైళ్లు తమ ప్రాంతాలకు కూడా వేయాలని ప్రజలు కోరుతున్నారని తెలిపారు. ఎందుకంటే తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో గమ్యస్థానాలను చేరుతున్నారు. దాదాపుగా విమాన ప్రయాణ సమాయంతో సమానంగా గమ్యస్థానాలకు చేరుతున్నట్లు వివరించారు.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను స్థానిక పార్లమెంట్ సభ్యుడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చొరవతో 750కోట్ల ఖర్చు అత్యాధునికంగా అంతర్జాతీయ స్థాయిలో నిర్మాణం జరుగుతుందని దీనికి కూడా అదే రోజు ప్రధాని శంకుస్థాపన చేయడంతోపాటు రాష్ట్రంలో వేలాది కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులను కూడా ప్రధాని ప్రారంభిస్తారని వెల్లడించారు. ఎటువంటి వివక్ష చూపకుండా ప్రతిఏటా వేలాది కోట్లు కేటాయించి రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేపడుతుంటే కళ్ళుండి చూడలేని కాబోది లాగా కేసీఆర్ ప్రధాని మోడీ పై విమర్శలు చేస్తున్నాడని అన్నారు.ఉద్యోగాల పేరు మీద తెలంగాణ యువతను ఈ ప్రభుత్వం మోసం చేస్తుందని రాష్ట్రంలో లీకేజీల జాతర సాగుతుందని ఘాటుగా విమర్శించారు..

Advertisement

Next Story

Most Viewed