అవగాహన లేని నాయకులతో జాగ్రత్త

by Sridhar Babu |   ( Updated:2023-11-10 11:17:38.0  )
అవగాహన లేని నాయకులతో జాగ్రత్త
X

దిశ, చైతన్య పురి : నియోజకవర్గం మీద అవగాహన లేని కొత్త కొత్త నాయకులు ఓట్లకోసం వస్తున్నారని వారి పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలని ఎల్బీనగర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ప్రజలకు సూచించారు. నిజామాబాద్ నుండి తరిమికొడితే ఇక్కడ వచ్చి పడ్డాడని, నిజామాబాద్ లో చెల్లని రూపాయి హైదరాబాదులో చెల్లుతుందా అని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం చైతన్యపురి డివిజన్ పరిధిలోని మున్సిపల్ కాలనీ, ఇంద్రనగర్ కాలనీలతో పాటు చుట్టుపక్కల కాలనీలలో పార్టీ శ్రేణులతో కలిసి పాదయాత్ర చేశారు. బస్తీవాసులు సుధీర్ రెడ్డికి అడుగడుగునా పూలు, మంగళహారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొందరు

దొంగ వీసాలు, నకిలీ డ్యాక్యుమెంట్లు సృష్టించి ఎంతో మందిని మోసం చేశారని, వారిపై పోలీస్ స్టేషన్లో 420 కేసులు కూడా నమోదు అయ్యాయని తెలిపారు. దానికి సంబంధించిన సాక్ష్యాలు యూట్యూబ్ లో ఉన్నాయని తెలిపారు. ఇప్పుడు ఇలాంటి వారు వచ్చి తాము అభివృద్ధి చేస్తామని అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బీజేపీ నుంచి పోటీ చేస్తున్న సామ రంగారెడ్డి సొంత బంధువుల పొలాలు కబ్జా పెట్టడం వల్ల అతని బంధువులే అతనిపై దాడి చేయడం నిజంకాదా అని ప్రశ్నించారు. దొంగలకు, కబ్జాకోరులకు నియోజకవర్గంలో స్థానం లేదన్నారు. బస్తివాసులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల నుంచి ఇండ్ల పట్టాల సమస్యలు ఎదుర్కొంటున్నా తమకు మీరు పట్టాలు ఇప్పించారని తెలిపారు. బస్తీవాసుల పూర్తి మద్దతు మీకే ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జిన్నారం విఠల్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు తోట మహేష్ యాదవ్, సీనియర్ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, నర్సిరెడ్డి, పవన్, శరత్ చంద్ర, నరేష్, చిన్నా యాదవ్, శ్రీహరి, నాగలక్ష్మి, జ్యోతి, జయశ్రీ, పావని, సంగీత, అనిత పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed