బోనాల పండుగకు ఏర్పాట్లు

by Sridhar Babu |
బోనాల పండుగకు ఏర్పాట్లు
X

దిశ, హైదరాబాద్ బ్యూరో : తెలంగాణ ఆస్తిత్వానికి, సాంస్కృతికి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఈ నెల 7 న శ్రీ జగదాంబ మహంకాళి గోల్కొండ లంగర్ హౌస్ నుండి తొట్టిల ఊరేగింపు మంత్రులచే ప్రారంభించబడుతుందని, సదరు బోనాల ఏర్పాట్లు అన్ని కమిటీ సభ్యులు , కార్యనిర్వాహణ అధికారి కలిసి నిర్వహించడం జరుగుతుందన్నారు. దేవాలయాలకు సంబంధించిన రంగులు, అలంకరణ మొదలగు పనులు ఇప్పటికే పూర్తయ్యాయని చెప్పారు.

అంతేకాకుండా ఆలయ ప్రాంగణంలో బారీకేడ్ల , సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే బోనాల పండుగ చెక్కులు పంపిణీకి సిద్ధం చేశామని, రెండు రోజులలో చెక్కుల పంపిణీ పూర్తవుతుందని వివరించారు. నగరంలోని ఇతర దేవాలయాల వద్ద భద్రత, పార్కింగ్, విద్యుత్ బారీకేడ్లు, తాగునీరు, టాయిలెట్స్ ల ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. బోనాల ఉత్సవాల సందర్భంగా ఆలయాల వద్ద భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు శాఖ ద్వారా పటిష్ట ఏర్పాట్లు చేపడుతోందన్నారు.

Next Story