గంజాయి తరలిస్తున్న ఇద్దరు అరెస్టు

by Sridhar Babu |
గంజాయి తరలిస్తున్న ఇద్దరు అరెస్టు
X

దిశ, వెల్గటూర్ : గంజాయి తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసి రెండు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్టు జగిత్యాల డీఎస్పీ రఘు చందర్ తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మీడియా సమావేశంలో డీఎస్పీ వెల్లడించారు. ధర్మపురి మండలం రాయపట్నం గ్రామానికి చెందిన బత్తిని చందు (23), గొల్ల వెంకటేష్ ( 25 ) అనే ఇద్దరు వ్యక్తులు గంజాయికి బానిస అయ్యారు. అది తాగ కుంటే వారు పిచ్చిపట్టినట్టు ప్రవర్తించేవారు. దాంతో పాటు తక్కువ ధరకు కొని, ఇక్కడకు తీసుకవచ్చి ఎక్కువ ధరకు అమ్మి సొమ్ము చేసుకునే వారు. వారి స్నేహితుడు రాము అనే వ్యక్తి వద్ద రెండు నెలల క్రితం గంజాయి కొనుగోలు చేసి వారు వినియోగించుకోగా మిగిలిన దానిని ఎక్కువ ధరకు అమ్మాలని నిర్ణయించారు. దాంతో చందు,

వెంకటేష్ తమ బైక్​లలో గంజాయిని విక్రయించేందుకు ధర్మపురి వైపు వస్తున్నారు. ధర్మపురి హెచ్పీ పెట్రోల్ పంప్ వద్దకు రాగేనే ధర్మపురి సీఐ రాం నరసింహా రెడ్డి, ఎస్సై ఉదయ్ కుమార్ తమ సిబ్బందితో కలిసి అనుమానాస్పదంగా ఉన్న వీరిని తనిఖీ చేయగా వారి వద్ద 2.070 కిలోల గంజాయి లభించింది. దాంతో గంజాయి తోపాటు రెండు సెల్ ఫోన్లు, రెండు మోటార్ సైకిల్స్ ని పోలీస్ లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.40 వేలు ఉంటుందని డీఎస్పీ వెల్లడించారు. రాము తో పాటు మరికొంతమంది పరారీలో ఉన్నట్టు తెలిపారు. కేసులో చాక చక్యంగా వ్యవహరించిన డీఎస్పీ రఘు చందర్, ధర్మపురి సీఐ రాం నరసింహా రెడ్డి, ఎస్సై ఉదయ్ కుమార్, ఏఎస్సై సూర్య నారాయణ రాజు , హెడ్ కానిస్టేబుల్స్ శంకర్, వెంకటయ్య, రామస్వామి, కానిస్టేబుల్స్ రమేష్, నవీన్ కుమార్, రమేష్ నాయక్ లను జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అభినందించారు.

Next Story

Most Viewed