మేక రక్తంతో అఘోర పూజలు

by Sridhar Babu |
మేక రక్తంతో అఘోర పూజలు
X

దిశ, సిటీక్రైం : నవరాత్రుల పూజల సందర్భంగా ఓ అఘోర ఇన్ స్టా గ్రాంలో పోస్టు చేసిన వీడియో వివాదానికి కారణమైంది. ఆ వీడియోపై జంతు సంరక్షణ కార్యకర్త ఫిర్యాదు మేరకు రాచకొండ పోలీసులు విచారణను చేపట్టారు. ఈ ఇన్ స్టాగ్రాం వీడియోకి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ శివారు ఘట్ కేసర్ పోలీసు స్టేషన్ పరిధిలోని కాళీ టెంపుల్ లో ఘంటెపాక నరసింహ పూజారిగా ఉన్నారు.

ఆ పూజారికి అఘోర గురు రాజా స్వామిగా ఇన్ స్టాగ్రాంలో గుర్తింపుతో పాటు చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇటీవల నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి మేక రక్తంతో పూజలు, ఆ తర్వాత మొండెం లేని మేకను మంటల్లో పడేస్తున్న వీడియోలను పోస్టు చేశారు. దాంతో అది బాగా వైరల్ అయింది. ఈ వీడియో ను చూసిన జంతు సంరక్షణ కార్యకర్త గౌతమ్ ఘట్ కేసర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. యానిమల్ క్రూయాల్టీ కింద చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు పై పోలీసులు విచారణను చేపట్టారు.

Advertisement

Next Story

Most Viewed