ఫుడ్ సేఫ్టీ లేని హోటల్స్, స్వీట్ సెంటర్ల పై చర్యలు

by Kalyani |
ఫుడ్ సేఫ్టీ లేని హోటల్స్, స్వీట్ సెంటర్ల పై చర్యలు
X

దిశ, హైదరాబాద్ బ్యూరో : నిజామాబాద్ జిల్లాలో ఇటీవల ఫుడ్ సేఫ్టీ హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ ( Food Safety Hyderabad Task Force ) అధికారుల చేసిన దాడులలో యాజమాన్యాలపై చర్యలు తీసుకోవడానికి అధికారులు నివేదికలు సిద్ధం చేశారు. వీటి ఆధారంగా ఢిల్లీ వాలా స్వీట్ హోమ్, లహరి ఇంటర్నేషనల్ , వంశీ హోటల్ లపై క్రిమినల్ కేసులు పెట్టనున్నారు. ఈ సందర్భంగా ఫుడ్ సేఫ్టీ హైదరాబాద్ ట్రాస్క్ ఫోర్స్ ( Food Safety Hyderabad Task Force) అధికారి జ్యోతిర్మయి మాట్లాడుతూ… జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు లేకపోవడం వల్లనే పేరొందిన హోటల్స్ లో సైతం అక్రమాలు జరుగుతున్నాయన్నారు. తాము జరిపిన దాడులలో ఢిల్లీ వాలా స్వీట్ హోంలో సింథటిక్ రంగులో మిఠాయిలు వినియోగించడం, హోటల్ లోని రిఫ్రిజిరేటర్ లో దాదాపు నెల రోజులకు పైగా నిల్వ ఉంచిన కోడి మాంసంను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. ల్యాబ్ రిపోర్టులు ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు అందించనున్నట్లు చెప్పారు. కాగా తనిఖీలు జరిగిన స్టార్ హోటల్లో విషయం తెలియక అదే రోజు ఓ పోలీసు ఉన్నతాధికారి వీడ్కోలు ఫంక్షన్ సైతం నిర్వహించడం గమనార్హం.

Advertisement

Next Story