- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీఎస్పీఎస్సీ చైర్మన్, కార్యదర్శిని బర్త రఫ్ చేయాలి : ఏబీవీపీ
దిశ ప్రతినిధి, హైదరాబాద్: ప్రశ్నా పత్రాల లీకేజీ సంఘటనలో టీఎస్‌పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి, కార్యదర్శి అనితా రామచంద్రన్‌లను బర్తరఫ్ చేయాలనీ ఏబీవీపీ డిమాండ్ చేసింది. శుక్రవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో హైదరాబాద్ కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ తెలంగాణ స్టేట్ జాయింట్ సెక్రెటరీ కమల్ సురేష్ మాట్లాడుతూ.. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీకి కారకులైన చైర్మన్, కార్యదర్శి అనిత రామచంద్రన్‌ను బర్తరప్ చేసి.. వెంటనే ఈ వ్యవహారంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు జరిగిన ఎగ్జామ్స్ అన్నింటి పైన సమగ్రమైన విచారణ జరిపించాలన్నారు.
టీఎస్పీఎస్సీ సంఘటన జరిగి వారం రోజులైనా సీఎం కేసీఆర్ స్పందించకపోవడం చూస్తోంటే నిరుద్యోగుల మీద ముఖ్యమంత్రికి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదనిపిస్తోందన్నారు. ఏబీవీపీ రాష్ట్ర కార్య సమితి సభ్యులు జీవన్ మాట్లాడుతూ.. ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న వారిని అబిడ్స్ పోలీసులు దుర్మార్గంగా ఇడ్చికెళ్ళి, లాటి చార్జి, అరెస్టు చేసి అమానుషంగా ప్రవర్తించారని ఆరోపించారు. ఈ అరెస్టుల వెనక ముఖ్యమంత్రి కేసీఆర్ హస్తం ఉందని.. రాబోయే రోజుల్లో లాటిలు, తూటాలు ఏబీవీపీ ఉద్యమాన్ని ఆపలేరన్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ రాజు, జిల్లా కన్వీనర్లహరిప్రసాద్, సభావట్ కళ్యాణ్ నాయక్, స్టేట్ గర్ల్స్ కన్వీనర్ సిరివెన్నెల, రాజు షిండే, ఉదయ్ ధనరాజ్, సాయి, పవన్, ఉదయ్ కార్తీక్, విక్రమాదిత్య, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.