- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అమ్మవారి బోనాలకు సర్వం సిద్దం..
దిశ, బేగంపేట : తెలంణాలోనే ఎంతో ప్రసిద్ధి చెందిన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 21వ తేదీ ఆదివారం బోనాలు, 22 వ తేదీ సోమవారం రంగం కార్యక్రమం నిర్వహించేందుకు ఆయా శాఖల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 200 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన మహంకాళి అమ్మవారి జాతరకు తెలంగాణాలోనే కాకుండా వివిధ రాష్ట్రాల్లో కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి ఏడాది లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు ఆయా ప్రాంతాల నుంచి వస్తారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని దేవదాయ శాఖ, జీహెచ్ఎంసీ, ఎలక్ట్రిసిటీ, జలమండలి, ఆర్ అండ్ బీ, పోలీసు తదితర శాఖల అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టారు.
సర్వాంగ సుందరంగా దేవాలయం...
బోనాల జాతర సందర్భంగా మహంకాళి దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. దేవాలయాన్ని రంగులు, విద్యుత్ దీపాలు, పువ్వులు, పండ్లతో సర్వాంగ ముస్తాబు చేశారు. దేవాలయం చుట్టు పక్కల ప్రాంతాల్లో స్వాగత తోరణాలు, విద్యుత్ దీపాలతో అలంకరించారు. దేవాలయంతో పాటు పరిసర ప్రాంతాలు జాతర శోభను సంతరించుకున్నాయి.
ఉదయం 3.30 గంటలకు తొలిపూజ..
ఆదివారం ఉదయం 3.30 గంటలకు అమ్మవారికి తొలి పూజ నిర్వహించనున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సమేతంగా తొలిపూజ, హారతిలో పాల్గొంటారు. దేవాలయ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ కుటుంబం, అధికారులు పాల్గొంటారు. అనంతరం 4 గంటలకు నిమిషాలకు సాధారణ భక్తులు దర్శనం చేసుకునేందుకు అనుమతిస్తారు.
బోనాలతో వచ్చే వారికి రెండు క్యూ లైన్లు..
బోనాల జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా బోనాల జాతరకు వచ్చే భక్తులకు 6 క్యూలైన్లు బోనాలతో వచ్చే వారికి రెండు క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా రెండు క్యూ లైన్లు బోనాలతో వచ్చే వారి కోసం ఏర్పాటు చేశారు. ఇందులో ఒకటి పాత రాంగోపాల్పేట్ పోలీస్ స్టేషన్, మరొకటి బాటా వైపు నుంచి ఉన్నాయి. అలాగే పాత రాంగోపాల్పేట్ వైపు ఒకటి సాధారణ భక్తులకు, టొబాకో బజార్ నుంచి దాతల కోసం, అంజలి థియేటర్ నుంచి వీఐపీ పాస్లతో వచ్చే వారికి ఒకటి, సాధారణ భక్తులు కోసం మరో క్యూలైన్లు ఏర్పాటు చేశారు. వీవీఐపీలు మాత్రం దేవాలయ ఆర్ గేటు నుంచి నేరుగా లోపలికి వస్తారు. అత్యవసర సర్వీసుల కోసం దేవాలయం వెనుక వైపు అద్దాల మంటపంలోకి మరో క్యూ లైన్ ఏర్పాటు చేశారు.
నాలుగు ఎగ్జిట్ గేట్లు..
అమ్మవారిని దర్శించుకున్న తర్వాత భయటకు వెళ్లేందుకు గతంలో మూడు గేట్లు ఉండగా ఈ ఏడాది అదనంగా మరొక గేటును ఏర్పాటు చేశారు. దీంతో అమ్మవారి దర్శనం తరువాత వెంటనే బయటకు వెళ్లి రద్దీ తగ్గుతుంది.
మంచి నీళ్లు, వైద్య శిబిరాలు
జాతరలో వచ్చే భక్తుల కోసం దేవాలయం చుట్టుపక్కల మంచినీళ్లు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు.
100 సీసీ కెమెరాలతో నిఘా..
బందోబస్తులో 1,500 మంది పోలీసులు ఉదయం 4 గంటల నుంచి దర్శనానికి అనుమతి.
నార్త్ జోన్ డీసీపీ సాధన రష్మీ పెరుమాళ్..
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆషాడ బోనాల జాతరకు పోలీసు శాఖ సర్వం సిద్ధం చేసినట్లు ఉత్తర మండల డీసీపీ సాధన రష్మీ పెరుమాళ్ అన్నారు. జాతర ఆద్యంతం 20 గంటలు వంద సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఆది, సోమవారాలలో జరుగనున్న బోనాల జాతర భద్రతా వివరాలు నార్త్ జోన్ డీసీపీ వెల్లడించారు.