హైదరాబాద్‌ మండి బిర్యానీ తిని 12 మందికి అస్వస్థత..

by sudharani |
హైదరాబాద్‌ మండి బిర్యానీ తిని 12 మందికి అస్వస్థత..
X

దిశ, వెబ్‌డెస్క్: బిర్యానీకి హైదరాబాద్ అడ్డా. ఇక్కడ ప్రతి గల్లీకి ఓ బిర్యానీ సెంటర్ ఉందంటే అతిశయోక్తి కాదు. వాటిలో కొన్ని నాణ్యత లేని బిర్యానీని వినియోగదారులకు వడ్డిస్తున్నారు. అందుకే పలు చోట్ల బిర్యానీలు తిని కొంతమంది అస్వస్థతకు గురవుతుంటారు. ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్ మండి బిర్యానీ తిని ఏకంగా 12 మంది అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. దానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

సనత్‌నగర్‌లోని మాషా అల్లా అనే హోటల్ ఉంది. గురువారం ఆ హోటల్లో మండి మటన్ బిర్యానీ తిని 12 మందికి వాంతులతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు రావడంతో అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే.. శుక్రవారం ఆరుగురు డిశ్చార్జ్ కాగా మరో ఆరుగురు చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. కాగా.. బాధిత వ్యక్తులు ఆ హోటల్‌పై ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న అధికారులు హోటల్లో తనిఖీలు జరిపి సీజ్ చేశారు. అంతే కాకుండా దీనిపై పూర్తి విచారణ జరిపి తదుపరి చర్యలు తీసుకుంటామని ఖైరతాబాద్ సర్కిల్ జీహెచ్ఎంసీ అసిస్టెంట్ ఆఫీసర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ భార్గవ తెలిపారు.

Advertisement

Next Story