- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మూడు రాష్ట్రాల సీఎంలకు కిషన్ రెడ్డి లేఖ.. KCR హాజరయ్యేనా?
దిశ, తెలంగాణ బ్యూరో :హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు శనివారం మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. విమోచన దినోత్సవంలో భాగస్వాములు కావాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే, కర్ణాటక ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మైకి లేఖ రాశారు. అతిథులుగా హాజరుకావాలని కిషన్ రెడ్డి వీరికి లేఖలు పంపారు. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ ఏడాది సెప్టెంబర్ 17న హైదరాబాద్‌లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించారు. దీంతోపాటుగా ఏడాదిపాటు హైదరాబాద్ విమోచన దినోత్సవాలను, నిజాం సంస్థానానికి సంబంధించిన ప్రాంతాల్లో నిర్వహించనున్నారు. ఏడాదిపాటు జరిగే కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కోరుతూ తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కిషన్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.
15 ఆగస్టు 1947లో దేశానికి స్వతంత్ర్యం రాగా 1948 సెప్టెంబర్ 15న హైదరాబాద్ సంస్థానం స్వతంత్ర్య భారతదేశంలో విలీనమైంది. నిజాంల అణచివేతకు వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు జరిగాయని, సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషితో ఈ నిరంకుశ పాలనకు బ్రేక్ పడిందని పేర్కొన్నారు. తెలంగాణకు విముక్తి లభించిందని కిషన్ రెడ్డి లేఖలో వెల్లడించారు. హైదరాబాద్ సంస్థానం నుంచి పలు జిల్లాలు కర్నాటక, మహారాష్ట్రలో కలిశాయని ఇందులో పేర్కొన్నారు. ఈ కారణంగానే మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా ఆయన లేఖ రాశారు. పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించే ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ మంత్రి ముఖ్య అతిథిగా హాజరవుతున్న నేపథ్యంలో మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా అతిథులుగా హాజరు కావాలని ఆయన లేఖ ద్వారా పేర్కొన్నారు.