- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హైదరాబాద్, బెంగళూరు నగరాలు కంట్రీ కజిన్స్: మంత్రి ప్రియాంక్ ఖర్గే
దిశ, తెలంగాణ బ్యూరో: జనవరి 5న హైదరాబాద్‌లో డబ్ల్యూటీఐటీసీ వార్షిక సమావేశం నిర్వహిస్తున్నామని డబ్ల్యూటీఐటీసీ చైర్మన్ సందీప్ మక్తాల తెలిపారు. మంగళవారం బెంగళూరు విధాన్ సౌధలో కర్ణాటక రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గేతో భేటీ అయ్యారు. సమావేశానికి రావాలని ఆహ్వానించారు. తెలుగు రాష్ట్రాలతో పాటుగా కర్ణాటకలో ఐటీ పరిశ్రమ అభివృద్ధి, ఉద్యోగుల కోసం ఒక కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇన్నోవేషన్, నాలెడ్జ్ ఎక్స్చేంజ్, సమ్మిళిత వృద్ధి అంశాలు ప్రాతిపదికగా ఈ కమిటీ పని చేయనుందని తెలిపారు.
కర్ణాటక రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే మాట్లాడుతూ.. హైదరాబాద్, బెంగళూరు నగరాలు ఐటీ పరిశ్రమలో తమదైన ముద్ర వేసుకొని ముందుకు సాగుతున్నాయని, పోటీ తత్వంతో సాగుతున్న ఈ రెండు నగరాలు కంట్రీ కజిన్స్ వంటివని, రాష్ట్రాల ప్రగతికి చిహ్నంగా నిలిచాయని అన్నారు. ఈ సమావేశంలో యురేషియన్ రీజియన్ ట్రేడ్ కమిషనర్ యతీష్ వెంకటేష్, గణేష్ పాపన్న, కేఆర్‌టీఏ సెక్రటరీ జనరల్ ఈవీ సతీష్ కుమార్, డబ్ల్యూటీఐటీసీ ఆంధ్రప్రదేశ్ సెక్రటరీ ప్రసన్న రెడ్డి, దండు రామకృష్ణరాజు, గారపాటి వెంకట రమణ, ఇలియాస్, అభిలాష్ రంగినేని, పరవస్తు శ్రీరామ్, వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.