- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
HYD : పారిశ్రామిక వాడలో గ్యాస్ లీక్.. పలువురికి అస్వస్థత
దిశ,ఉప్పల్ : నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో మాణిక్ చందు చౌరస్తా సమీపంలో మల్లాపూర్ పారిశ్రామిక వాడలోని ఏకశిల రసాయన కంపెనీలో తెల్లవారుజామున రసాయనాల గ్యాస్ లీక్ అయింది. జేపీ పెయింట్స్ ఘటన మరవక ముందే మరో ఘటనతో కార్మికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఏకశిల రసాయన కంపెనీలోవిషవాయువులు వెలువడి పలువురు కార్మికులకు అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయాన్ని తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని రసాయనాల గ్యాస్ లీక్ తీవ్రత ఎక్కువ కావడంతో అగ్నిమాపక సిబ్బంది గ్యాస్ లీక్‌ను కట్టడి చేసే చర్యలు చేపట్టారు.
అక్కడ పనిచేసే కార్మికులు అమోనియో విష వాయువు పీల్చుకుని శ్వాస తీసుకోవడంలో కార్మికులు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. కార్మికులు అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రికి తరలించారు. ప్రాణాంతకమైన అమోనియోను కంపెనీలో ఎలా వాడుతారని, కంపెనీకి పర్మిషన్ ఉన్నాదా లేదా అని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పారిశ్రామిక వాడలో ఉన్న ఏకశిల రసాయన కంపెనీకి అనుమతులు ఉన్నాయా ఒకవేళ ఉంటే రెన్యువల్ చేసుకున్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అధికారులు వెంటనే స్పందించి ఏకశిలా కంపెనీపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.