- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
HYD : జిమ్ చేస్తుండగా కానిస్టేబుల్..
దిశ, కంటోన్మెంట్/బోయిన్ పల్లి: జిమ్ చేస్తుండగా కానిస్టేబుల్ మృతి చెందిన సంఘటన మారేడ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆదయ్య నగర్, న్యూ గ్యాస్ మండిలో నివాసం ఉంటున్న మృతుడు విశాల్ (24) 2020 బ్యాచ్లో కానిస్టేబుల్ ఉద్యోగాన్ని సంపాదించి ఆసీఫ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు.
ప్రతి రోజు విశాల్ మారేడ్ పల్లిలోని ఓ జిమ్‌కు వెళ్తాడని, గురువారం ఉదయం ఏడు గంటల ప్రాతంలో జిమ్‌కు వెళ్లిన గంటన్నర తర్వాత తండ్రి ధరమ్ ప్రకాష్‌కు విశాల్ జిమ్ చేస్తూ కుప్పకూలి పోయాడని కాల్ వచ్చింది. అక్కడ ఉన్న వారు వెంటనే గమనించి 108కు కాల్ చేసి సికింద్రాబాద్‌లోని ప్రయివేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఉన్న డ్యూటీ డాక్టర్లు పరీశీలించి చనిపోయినట్లు ధృవీకరించారు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మారేడ్ పల్లి పోలీస్‌లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.