- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
HYD: నేడు రాష్ట్రపతి ముర్ము రాక.. స్వాగతం పలకనున్న CM KCR
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం సోమవారం హైదరాబాద్ రానున్నారు. ఈ నెల 30 వరకు సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారు. రాష్ట్ర పతి పర్యటన నేపథ్యంలో సీఎం కేసీఆర్ స్వాగతం పలకనున్నట్లు సమాచారం. ఈ మేరకు హకీంపేటకు సాయంత్రం సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు. సోమవారం రాత్రి రాజ్ భవన్‌లో రాష్ట్రపతికి గవర్నర్ ఇచ్చే విందులో సీఎం పాల్గొనే అవకాశాలున్నాయి. రాష్ట్రపతి మధ్యాహ్నం 12.30 గంటలకు శంషాబాద్ చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ లో శ్రీశైలం వెళ్లి సాయంత్రం 4.15 గంటలకు హకీంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. కాగా రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రతిపక్షాలు బలపర్చిన యశ్వంత్ సిన్హాకు మద్దతు తెలిపారు. బీజేపీ, మోడీతో వైరం కారణంగా గత కొన్ని రోజులుగా ప్రధాని పర్యటనలకు స్వాగతం పలకని సీఎం కేసీఆర్ రాష్ట్రపతి ముర్ముకు స్వాగతం పలికే విషయమై ఆసక్తి నెలకొంది.
Also Read...