Hussain Sagar: నగరంలో దంచికొట్టిన వర్షం.. హుస్సేన్ సాగర్‌కు డేంజర్ బెల్స్

by Shiva |
Hussain Sagar: నగరంలో దంచికొట్టిన వర్షం.. హుస్సేన్ సాగర్‌కు డేంజర్ బెల్స్
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మహా నగరంలో వర్షం బీభత్సంగా పడుతోంది. ప్రధాన కూడళ్లలో వరద నీరు పొంగిపొర్లుతోంది. పలుచోట్ల ఇప్పటికే 10 సెం.మీ మేర వర్షపాతం నమోదవ్వడంతో నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. హుస్సేన్‌సాగర్‌ గరిష్ట స్థాయి నీటి మట్టం 514 మీటర్లు కాగా.. ప్రస్తుతం నీటిమట్టం 513.65 మీటర్లకు చేరింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం మంగళవారం రాత్రికి కూడా పడే అవకాశం ఉంది. ఈ క్రమంలో జీహెచ్ఎంసీతో పాటు డీఆర్ఎఫ్ సిబ్బందితో వర్షాలపై మేయర్ విజయలక్ష్మి, కమిషనర్ ఆమ్రపాలి ఎప్పటికప్పడు సమీక్ష నిర్వహిస్తున్నారు. అదేవిధంగా రానున్న మరో నాలుగు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

Advertisement

Next Story