మహిళా కౌన్సిలర్లకు బదులు భర్తలు.. కలెక్టర్ ప్రొగ్రాంలోనూ వారిదే పెత్తనం

by Sathputhe Rajesh |   ( Updated:2023-05-12 08:10:15.0  )
మహిళా కౌన్సిలర్లకు బదులు భర్తలు.. కలెక్టర్ ప్రొగ్రాంలోనూ వారిదే పెత్తనం
X

దిశ, రామకృష్ణాపూర్ : మహిళా రిజర్వేషన్లు అభాసుపాలవుతున్నాయి. పేరుకే మహిళా ప్రజాప్రతినిధులు వారి వెనక కుటుంబ సభ్యులే ఉండి వ్యవహారాలు నడిపిస్తున్నారు. ఇందుకు తాజా ఉదాహరణ గురువారం క్యాతన్ పల్లి పుర కార్యాలయంలో పాలనాధికారి ఆధ్వర్యంలో జీవో నంబర్ 76 ఇంటి స్థలాల క్రమబద్ధీకరణ అనే కార్యక్రమం నిర్వహించగా మహిళా కౌన్సిలర్లకు బదులు వారి భర్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం ప్రారంభం కంటే ముందు పుర, రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులు తప్ప సమావేశంలో ఎవ్వరూ ఉండకూడదనే విషయన్ని పురపాలక సిబ్బంది మరిచిపోయారా అంటూ స్థానికులు గుసగుసలాడుతున్నారు.

Also Read.

చిత్రపురి కాలనీలో అక్రమ కట్టడాల కూల్చివేత

Advertisement

Next Story