- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కామ వాంఛ తీర్చుకోవడానికి కట్టుకున్నోడినే కడతేర్చారు..
దిశ ప్రతినిధి, కొత్తగూడెం: వివాహేతర సంబంధాలు మానవ బంధాలను మట్టు పెడుతున్నాయి. కామ వాంఛతో కళ్ళు మూసుకుపోయి కట్టుకున్న వాడినే కడతేర్చేలా చేసింది. తాత్కాలిక సుఖాలకు తలొగ్గి నాతిచరామి అన్న మాటను మరిచి నీతి తప్పుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం సన్యాసి బస్తీలో ఇలాంటి సంఘటనే ఇప్పుడు కలకలం రేపుతోంది. సన్యాసి బస్తీలో ఉంటున్న ఓ వ్యక్తి ఐదేళ్ల క్రితం ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే కొన్నాళ్లుగా వీరిద్దరి మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి. దీంతో తరచూ భార్యాభర్తలు గొడవ పడుతుండేవారు.
దీంతో భార్య గత కొన్ని రోజులుగా తల్లి గారి ఇంటి వద్ద ఉంటుంది. ఈ క్రమంలో మరో యువకుడితో సన్నిహితంగా మెలుగుతుందంటూ చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఈ వ్యవహారం ఆ నోట ఈ నోట భర్త చెవిలో పడింది. ఈ విషయమై భర్త తన భార్యను నిలదీసేసరికి వారి మధ్య గొడవలు తారస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో సదరు వ్యక్తి భార్య మరో యువకుడితో కలిసి గడ్డ పారతో భర్త నడుముపై మొదడంతో అక్కడికక్కడే కుప్పకూలాడు. కాళ్ళు, చేతులు విరిగేలా నాప రాళ్లతో విచక్షణా రహితంగా కొట్టినట్లు చివరి సారి తీసిన వీడియోలో బాధితుడు వాపోయాడు.
ఆదివారం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ భర్త చనిపోయాడు. ఇదిలా ఉండగా ఈ ఘటనలో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. స్థానిక మాజీ రౌడీషీటర్(రాజకీయ నాయకుడు) భార్య భర్తల మధ్య పంచాయతీ చేసి వ్యవహారాన్ని గతంలో సద్దుమనిగేలా చేశాడు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ స్థానిక రౌడీషీటర్ పెద్దమనిషి ముసుగులో ఆ వ్యక్తి భార్యను లోబరుచుకుని వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని జోరుగా ప్రచారం సాగుతోంది. వీరి మధ్య వివాదాలను అదునుగా తీసుకున్న రాజకీయ నాయకుడు తన అనుచరులతో పాటు భార్య, ఆమె ప్రియుడితో కలిసి భర్తపై పది రోజుల క్రితం దాడికి పాల్పడినట్టు స్థానికులు వాపోతున్నారు.
శనివారం రాత్రి భార్య ప్రియుడితో కలిసి భర్తపై పాశవికంగా దాడికి పాల్పడినట్లు సమాచారం. దీంతో భర్త చికిత్స పొందుతూ మరణించినట్లు తెలుస్తోంది. పెద్దమనిషిగా వ్యవహరిస్తూ మృతుని భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని, భర్త అడ్డు తొలగించుకోవడానికి మాజీ రౌడీ షీటర్, ప్రియుడితో కలిసి అనేక మార్లు ఆ వ్యక్తిపై దాడికి ప్రేరేపించినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. భర్త మృతిపై పోలీసులు కేసు దర్యాప్తులో వేగం పెంచడంతో కేసు నుండి బయట పడేందుకు ఆ పెద్ద మనిషి అధికార పార్టీకి చెందిన ఓ రాజకీయ నాయకుడిని ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి నిజాలు తెలియాలి అంటే మృతుడి భార్య, మాజీ రౌడీ షీటర్(రాజకీయ నాయకుడి) కాల్ డేటా ఆధారంగా విచారణ చేపడితే అసలు వాస్తవాలు బయటికి వస్తాయని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.