హైదరాబాద్ ఈడీ ఆఫీసు ముందు భారీ బందోబస్తు

by Mahesh |
హైదరాబాద్ ఈడీ ఆఫీసు ముందు భారీ బందోబస్తు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేడు ఈడీ ఎదుట విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. అయితే, విచారణ అనంతరం కవితను ఈడీ అరెస్టు చేస్తుందనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.

కవిత అరెస్ట్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేయాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఈడీ కార్యాలయం ముందు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కవిత ఈడీ విచారణ నేపథ్యంలో బషీర్ బాగ్ ఈడీ కార్యాలయం గేట్స్ క్లోజ్ చేశారు. కవిత విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు ఇప్పటికే పలుచోట్ల దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed