- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వరదలపై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం.. గంటగంటకు అధికారులతో సీఎం సమీక్ష
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రభుత్వం అప్రమత్తం అయింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు, వంకలు, నదులు పొంగిపొర్లుతున్నాయి. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో భారీ వరదలతో అతలాకుతలం గా మారిపోయింది. దీంతో మంత్రులు అధికారులతో నిత్యం సమీక్షిస్తూ ఉన్నారు. కాగా వరదలపై అప్రమత్తంగా ఉండాలని ఇదివరకు చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. గంట గంటలకు అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ భారీ వరదలను కేంద్రం దృష్టికి కేంద్ర మంత్రి బండి సంజయ్ తీసుకెళ్లగా.. స్పందించిన హోంమంత్రి అమిత్ షా, ప్రధాని మోడీ నిన్న రాత్రి సీఎం రేవంత్ రెడ్డి కి కాల్ చేసి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అలాగే వరదలపై మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దీంతో పాటుగా కేంద్ర అన్ని విధాల అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కాగా నిన్నటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి అధికారులు, కలెక్టర్లు, స్థానిక మంత్రులతో వరదల గురించి సమాచారం తెలుసుకుంటూనే ఉన్నారు. ఈ క్రమంలోనే లోతట్టు ప్రాంత ప్రజలను క్షేమంగా ఉంచాలని.. వారికి కావాల్సిన ఆహారం అందించాలని అధికారులకు సీఎం సూచించారు. వరదలపై అధికారులు, సీఎస్ తో సీఎం అర్ధరాత్రి వరకు సమీక్ష నిర్వహించారు. అలాగే వరదలు తగ్గుముఖం పట్టగానే నష్టాన్ని అంచనా వేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు.