- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సాంకేతిక పరిజ్ఞానంలో తెలంగాణే నెంబర్ వన్: హోం మంత్రి
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో/ముషీరాబాద్: శాంతిభద్రతల పరిరక్షణ కోసం తెలంగాణ పోలీసుశాఖ వినియోగిస్తున్న అధునాతన సాంకేతిక పరిజ్ఞానం దేశవ్యాప్తంగా చర్చనీయంగా మారిందని హోంమంత్రి మహమూద్‌అలీ అన్నారు. రాష్ర్ట అవతరణ నేపథ్యంలో నిర్వహించిన సురక్షా దివస్‌లో భాగంగా అంబేద్కర్విగ్రహ ఆవరణలో ఏర్పాటు చేసిన జైళ్లు, అగ్నిమాపక శాఖ స్టాళ్లను హోంమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. శాంతిభద్రతలు సురక్షితంగా ఉన్న నేపథ్యంలోనే రాష్ర్టం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని చెప్పారు.
డీజీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ.. నేర పరిశోధనలో తెలంగాణా పోలీసులు ఉపయోగిస్తున్న ఆధునిక పరికరాలు మరే రాష్ట్రంలో లేవని చెప్పారు. తెలంగాణా పోలీస్ శాఖలోని 80 వేల మంది సిబ్బంది కృషి వల్లనే శాంతిభద్రతలు సురక్షితంగా ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో హోంశాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్, అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి, అదనపు డీజీలు మహేశ్‌భగవత్, విజయ్‌కుమార్, షిఖా గోయల్, అభిలాష బిస్త్, స్వాతి లక్రా, సంజయ్‌కుమార్‌జైన్, సందీప్‌శాండిల్య, ట్రై కమిషనరేట్ల కమిషనర్లు సీ.వీ.ఆనంద్, స్టీఫెన్రవీంద్ర, దీ.ఎస్.చౌహాన్తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా సైబర్ సెక్యూరిటీ, రోడ్డు భద్రతపై పోలీసుశాఖ, టీఏఎస్ కే (టాస్క్)మధ్య ఎంఓయూ కుదిరింది. దీనిపై టాస్క్సీఈవో శ్రీకాంత్‌సిన్హా, ఐజీ రమేశ్‌రెడ్డి, విశ్వజిత్‌లు సంతకాలు చేశారు.