- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రధాని మోడీపై హోంమంత్రి అమిత్ షా ప్రశంసల వర్షం
దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని మోడీ జీవితాన్ని దేశ ప్రజల కోసం అంకితం చేశారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. మంగళవారం సికింద్రాబాద్‌లోని ఇంపీరియల్ గార్డెన్‌లో బీజేపీ సోషల్ మీడియా వారియర్స్‌తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి, భద్రాద్రి రాముడికి నమస్కారం పెట్టారు. మూడోసారి మోడీ సర్కార్ అధికారంలోకి రాబోతోందని అన్నారు. దేశంలో ఎక్కడికి వెళ్లినా మోడీ పేరు తప్ప వేరే పేరు వినిపించడం లేదని తెలిపారు. తెలంగాణలో 12 కంటే ఎక్కువ పార్లమెంట్ స్థానాలు గెలవాలని సూచించారు. పదేళ్లలో మోడీ సర్కార్ అవినీతిని అంతం చేసిందని గుర్తుచేశారు. దేశం సురక్షితంగా ఉందంటే దానికి కారణం మోడీ ప్రభుత్వమే అని అన్నారు. మోడీ హయాంలో దేశం అన్ని రంగాల్లో దూసుకుపోతుందని వెల్లడించారు.
ఐదొందల ఏళ్ల కల నెలవెర్చిన ఘనత బీజేపీ సర్కార్‌కే దక్కుతుందని అన్నారు. గతంలో కాంగ్రెస్ సర్కార్ చేయని పని మోడీ చేసి చూపించాడని అన్నారు. ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్, మహిళా రిజర్వేషన్ వంటి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. CAA నిర్ణయం కూడా మోడీ సర్కార్ చేసింది.. కాంగ్రెస్ పార్టీ చేయని పనిని మోడీ సర్కార్ చేసి చూపించిందని చెప్పారు. తెలంగాణ అభివృద్ధి కూడా మోడీతోనే సాధ్యమన్నారు. ప్రపంచంలో అత్యంత ఆదరణ పొందిన వ్యక్తి మోడీ అని కొనియాడారు. మోడీ జీవితం మొత్తం ప్రజల కోసమే అంకితం చేశాడని అన్నారు. ప్రపంచంలో విరామం తీసుకోకుండా పనిచేసే నాయకులు ఒక్క మోడీ తప్పా మరెవరూ లేరని తెలిపారు.