Viral Video : హిజాబ్ ధరించిన హిందూ యువతి.. వీడియో వైరల్

by Ramesh N |   ( Updated:2024-10-15 13:13:53.0  )
Viral Video : హిజాబ్ ధరించిన హిందూ యువతి.. వీడియో వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: సాధారణంగా ముస్లిం మహిళలు బురఖా, హిజాబ్ ధరిస్తారని అందరికీ తెలిసిన విషయమే. అయితే, తాజాగా హిజాబ్ ధరించిన హిందూ యువతి అని ఓ వీడియో సామాజిక మాద్యమాల్లో వైరల్‌గా మారింది. వివారాల్లోకి వెళితే.. హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్ లోని తపస్య కాలేజీలో.. ఓ హిందూ విద్యార్థిని హిజాబ్ ధరించి చేసిన ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే, కాలేజ్ ప్రిన్సిపల్ షహీన్.. హిందువులతో, ఇతర మతానికి సంబంధించిన వీడియోలు, కార్యకలాపాలు చేసేలా ప్రోత్సహిస్తున్నారని ఈ విషయంపై వానర సేన ఆరోపించింది.

ఈ మేరకు కాలేజీకి వెళ్లి యాజమాన్యాన్ని వానరసేన నిలదీసింది. దీంతో ప్రిన్సిపల్‌ను తొలగిస్తామని యాజమాన్యం వారికి హామీ ఇచ్చినట్లు సమాచారం. కాగా, దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అప్పుడప్పుడూ హిజాబ్ వివాదం అవుతున్న విషయం తెలిసిందే. హిజాబ్‌పై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, విద్యా సంస్థలు, కోర్టులు రకరకాల ఆదేశాలు, తీర్పులు ఇచ్చాయి. ఈ వివాదరం సుప్రీంకోర్టుకు చేరడంతో కాలేజీలో విద్యార్థులు హిజాబ్ ధరించొచ్చని గతంలో కీలక ఆదేశాలు ఇచ్చింది.

Next Story