- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BRS జాతీయ జనరల్ సెక్రటరీగా హిమాన్షు
దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ విస్తరణపై కేసీఆర్ దృష్టి సారించారు. బీఆర్ఎస్ జాతీయ జనరల్ సెక్రటరీగా ఉత్తర ప్రదేశ్కు చెందిన హిమాన్షు తివారిని నియమిస్తూ బుధవారం పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. మహారాష్ట్రలో పలు డివిజన్లకు రీజినల్ కో ఆర్డినేటర్లను ప్రకటించారు. బీఆర్ఎస్ నాసిక్ డివిజన్ కో ఆర్డినేటర్‌గా దశరథ్ సావంత్, పూణె డివిజన్‌కు బాలసాహెబ్ జైరామ్ దేశ్ ముఖ్, ముంబై డివిజన్‌కు విజయ్ తాంజీ మోహితే, ఔరంగాబాద్ డివిజన్‌కు సోమ్ నాథ్, నాగ్ పూర్ డివిజన్‌కు ద్యానేష్ వకుద్కర్, అమరావతి డివిజన్ కో ఆర్డినేటర్‌గా నిఖిల్ దేశ్ ముఖ్ను నియమించారు.
మొదటిసారి..
బీఆర్ఎస్ మొదటిసారి జాతీయ కమిటీకి జనరల్ సెక్రటరీని నియమించింది. ఢిల్లీలో డిసెంబర్ 14న పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్ భారత్ రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షుడిగా హర్యానాకు చెందిన గర్నామ్ సింగ్ చడూని, కార్యాలయ కార్యదర్శిగా రవి కొహార్‌ను నియమించారు. ఆ తర్వాత పార్టీ కమిటీకి ఎవరిని నియమించలేదు. అయితే పార్టీ విస్తరణలో భాగంగా కమిటీని నియమిస్తే స్పీడ్ పెంచవచ్చని భావించి కమిటీ విస్తరణకు చర్యలు చేపట్టారు. అదే విధంగా మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండటంతో పోటీచేయాలని భావిస్తున్నారు. అందుకే డివిజన్లకు రీజినల్ కోఆర్డినేటర్లను నియమించినట్లు ప్రచారం ఊపందుకుంది.