జీవో 46 పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడం బాధాకారం: ఎనుగుల రాకేశ్ రెడ్డి

by Mahesh |   ( Updated:2024-08-28 07:56:33.0  )
జీవో 46 పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడం బాధాకారం: ఎనుగుల రాకేశ్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం పోలీస్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే నాటి పరిస్థితులకు అనుగుణంగా జీవో 46 ను ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే దీని వలన చాలా మంది అర్హులు ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందని పోలీస్ ఉద్యోగాల అభ్యర్థులు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. అయితే దీనిని న్యాయపరంగా ఎదుర్కునేందుకు నిరుద్యోగుల జీవో 46 పై హైకోర్టును ఆశ్రయించారు. కాగా ఈ రోజు తెలంగాణ హైకోర్టు జీవో 46పై వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. కోర్టు నిర్ణయంపై బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి స్పందించారు. జీవో 46 పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడం బాధాకారమని..ఎంతో మంది నిరుద్యోగుల, GO46 భాదితుల పోరాటాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. న్యాయం చేయమని కోర్టు మెట్లు ఎక్కితే ఇక్కడ కూడా నిరాశే ఎదురైందని అన్నారు. హైకోర్టు నిర్ణయంతో నిరుద్యోగులు ఎవరు బాధ పడవద్దని.. నిరాశ చెందవద్దని. GO46 ను రద్దు చేసేంత వరకు పోరాటం చేద్దామని.. పోరాడితే పోయేదేం లేదు, బానిస సంకెళ్ళు తప్ప అంటూ.. మీడియాతో రాకేష్ రెడ్డి చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story