- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
700 మంది విద్యార్థినులకు ఒకే టాయ్‌లెట్టా..? తెలంగాణ సర్కార్‌పై హైకోర్టు సీరియస్
దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న 700 మంది విద్యార్థినులకు ఒకే మరుగుదొడ్డి ఉన్నట్లు లా స్టూడెంట్ మణిదీప్ రాసిన లేఖను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి, ఇంటర్మీడియెట్ బోర్డు కమిషనర్‌కు, ఆ కాలేజీ ప్రిన్సిపాల్‌కు నోటీసులు జారీచేశారు. ఆరు వారాల్లోగా పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ఆదేశించి తదుపరి విచారణను ఏప్రిల్ 25కు వాయిదా వేశారు. ఏ కారణం చేత అంతమంది విద్యార్థులకు ఒకే మరుగుదొడ్డి ఉన్నదో స్పష్టత ఇవ్వాలని ఆ నోటీసుల్లో జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ తుకారాంజీ తో కూడిన డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. మణిదీప్ రాసిన లేఖను ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణించిన హైకోర్టు.. తెలంగాణ స్టట్ లీగల్ సర్వీస్ అథారిటీ మెంబర్ సెక్రటరీని ప్రతివాదిగా చేర్చింది.
కేవలం సరూర్‌నగర్ జూనియర్ కళాశాలను మాత్రమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో కనీస సౌకర్యాలను మెరుగుపర్చడానికి తీసుకున్న చర్యలపై కూడా ఆ నివేదికలో స్పష్టత ఇవ్వాలని నోటీసుల్లో హైకోర్టు బెంచ్ పేర్కొన్నది. కళాశాల మొత్తానికి ఒకే మరుగుదొడ్డి ఉండడాన్ని సీరియస్‌గా తీసుకున్న హైకోర్టు బెంచ్.. అది కూడా పనికిరాని స్థితిలో ఎందుకున్నదో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. కళాశాలలో మరుగుదొడ్డి సౌకర్యాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన విద్యార్థినులు గతేడాది డిసెంబరు 31న నిరసన వ్యక్తం చేసిన అంశాన్ని వార్తా పత్రికల్లో ప్రచురించడాన్ని మణిదీప్ తన లేఖలో ప్రస్తావించారు.
కాలేజీలో మరుగుదొడ్డికి నీటి సదుపాయం కూడా లేదని, త్రాగునీటి సౌకర్యాలు కూడా లేవని, కనీస మౌలిక సౌకర్యాలు లేక బాలికలు ఇబ్బంది పడుతున్నారన్న విషయాన్ని కూడా ఆ లేఖలో మణిదీప్ వివరించారు. నీటి సౌకర్యం లేని కారణంగా విద్యార్థినులు నెలసరి సమస్యల కారణంగా తరగతులకు హాజరుకాలేకపోతున్నారని, ఇలాంటి సమస్యలతోనే 300 మంది విద్యార్థినులు నిరసనల సందర్భంగా క్లాసులను బహిష్కరించారన్న ఆ వార్తా కథనం క్లిప్పింగును హైకోర్టు బెంచ్ పరిగణనలోకి తీసుకున్నది. తదుపరి విచారణను ఏప్రిల్ 25కు వాయిదా వేసినందున అప్పటి లోగా చీఫ్ సెక్రటరీ, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, ఇంటర్ విద్యా విభాగం కమిషనర్, కాలేజీ ప్రిన్సిపాల్ తదితరులు కౌంటర్ అఫిడవిట్‌లో సమగ్ర వివరాలను పొందుపర్చాల్సి ఉన్నది.