హైడ్రా కూల్చివేతలపై కేఏ పాల్ పిటిషన్.. ప్రభుత్వానికి నోటీసులు

by Y.Nagarani |
హైడ్రా కూల్చివేతలపై కేఏ పాల్ పిటిషన్.. ప్రభుత్వానికి నోటీసులు
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ లో చెరువులు, నాలాలను కబ్జా చేసి నిర్మించిన కట్టడాలను గుర్తించి.. వాటిని కూల్చివేయడమే లక్ష్యంగా హైడ్రా పనిచేస్తోంది. అయితే దీని ఫలితం పేదలపై కూడా తీవ్రంగా పడుతోంది. ఎవరో అమ్మితే తాము కొనుక్కుని కట్టుకుళ్ల ఇళ్లను కూల్చివేస్తున్నారని గగ్గోలు పెడుతున్నారు. ఈ క్రమంలో హైడ్రా కూల్చివేతలపై ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వెంటనే హైడ్రా కూల్చివేతలను ఆపివేయాలని వాదించారు.

జీఓ నంబర్ 99పై స్టే విధించాలని కేఏ పాల్ హైకోర్టులో వాదనలు వినిపించారు. కనీసం కూల్చివేతలకు 30 రోజుల ముందో నోటీసులు ఇవ్వాలని కోరారు. హైడ్రాకు చట్టబద్ధత కల్పించాకే కూల్చివేతలు చేపట్టాలని కేఏ పాల్ వాదించగా.. ఇప్పటికిప్పుడు కూల్చివేతల్ని ఆపలేమని న్యాయస్థానం పేర్కొంది. ఈ పిటిషన్ లో ప్రతివాదులుగా ఉన్న హైడ్రా, ప్రభుత్వానికి వెంటనే కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 14వ తేదీకి వాయిదా వేసింది.

Next Story

Most Viewed