High Court : బీఆర్ఎస్‌కు గుడ్ న్యూస్.. మానుకోట ధర్నాకు అనుమతి ఇచ్చిన హైకోర్టు

by Ramesh N |
High Court : బీఆర్ఎస్‌కు గుడ్ న్యూస్.. మానుకోట ధర్నాకు అనుమతి ఇచ్చిన హైకోర్టు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ‘లగచర్ల’ గిరిజనులకు సంఘీభావంగా (Mahabubabad) మహబూబాబాద్ జిల్లా (మానుకోట) కేంద్రంలో (BRS) బీఆర్ఎస్ గురువారం నిర్వహించ తలపెట్టిన (Maha Dharna) మహాధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే. దీంతో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ హైకోర్టు (High Court)ను ఆశ్రయించింది. ఈ క్రమంలోనే తాాజాగా బీఆర్ఎస్ పార్టీకి ఊరట లభించింది. మహబూబాబాద్ గిరిజన మహా ధర్నాకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 25న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు మహా ధర్నా కార్యక్రమం చేసుకోవచ్చని హైకోర్టు అనుమతి లభించింది.

కాగా, లగచర్ల బాధిత గిరిజన రైతులకు సంఘీభావంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించ తలపెట్టారు. ఈ ధర్నాకు చివరి నిమిషంలో పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో ఈ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసి హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా హైకోర్టు అనుమతి లభించడంతో మహాధర్నాకు సిద్దమవుతున్నారు. 50 వేల మందితో మహా ధర్నా నిర్వహిస్తామని ఇప్పటికే బీఆర్ఎస్ వెల్లడించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story