సీక్రెట్ మీటింగ్‌కు కారణమేంటి.. టీ-బీజేపీలో అసలు ఏం జరుగుతోంది..?

by Satheesh |   ( Updated:2023-09-24 04:22:40.0  )
సీక్రెట్ మీటింగ్‌కు కారణమేంటి.. టీ-బీజేపీలో అసలు ఏం జరుగుతోంది..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర బీజేపీలో జరుగుతున్న అంతర్యుద్ధాలపై బీజేపీ జాతీయ నాయకత్వం ఆరా తీసింది. ఢిల్లీలో రాష్ట్రానికి చెందిన ముఖ్య నేతలతో జాతీయ నేతలు భేటీ అయ్యారు. కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, ఎంపీ అర్వింద్, రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జి ప్రకాశ్ జవదేకర్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి సునీల్ బన్సల్‌తో పార్టీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ భేటీ అయ్యారు. టీ బీజేపీ నేతల అసంతృప్తికి గల కారణాలను ఆయన అడిగి తెలుసుకున్నట్లు సమచారం. సీక్రెట్ మీటింగులు పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆరా తీసినట్లు తెలుస్తోంది.

కొద్ది రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇలాంటివి జరగకుండా ఉండేందుకు ఏం చేస్తే బాగుంటుందని అడిగి వారి సూచనలు తీసుకున్నారు. అసంతృప్తి నేతలతో విడివిడిగా సంతోష్ భేటీ అయినట్లు టాక్. ఇలాంటి ఇష్యూస్ రాకుండా నేతలను ఎన్నికల క్షేత్రంలోకి దింపాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. పోయే వారే తప్పితే.. చేరికలేమయ్యాయంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అంతేకాకుండా రాష్ట్రంలో అగ్రనేతలు మోడీ, షా, నడ్డా సభల నిర్వహణ, సక్సెస్‌ చేయడంపైనా బీఎల్ సంతోష్ పలు సూచనలు చేసినట్లు వినికిడి. ఎన్నికల సమరశంఖానికి నేతలను సిద్ధం చేయాలని దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.

Read More: ఒకే నెలలో తెలంగాణకు మోడీ, అమిత్ షా, నడ్డా.. ఎన్నికల వేళ టీ- బీజేపీ బిగ్ స్కెచ్..!

Advertisement

Next Story

Most Viewed