నాంపల్లి కోర్టుకు హీరో అల్లు అర్జున్.. ఎందుకంటే..?

by Mahesh |
నాంపల్లి కోర్టుకు హీరో అల్లు అర్జున్.. ఎందుకంటే..?
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ (Allu Arjun) పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట(Stampede) ఘటన సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు, ప్రభుత్వం బాద్యులపై చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే హీరో అల్లు అర్జున్(Allu Arjun) ను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరు పర్చగా అతనికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం కొద్ది సేపటికే అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ రాగా ఆయన జైలు నుండి విడుదల అయ్యాడు. అనంతరం హీరో అల్లు అర్జున్ మరోసారి కోర్టును ఆశ్రయించగా.. శుక్రవారం ఆయనకు కోర్టు షరతులతో కూడా బెయిల్(Bail) మంజూరు చేసింది. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం హీరో అల్లు అర్జున్ తన రెగ్యుల‌ర్ బెయిల్(Regular bail) కు సంబంధించిన పూచిక‌త్తు(Guarantors) పేప‌ర్లను స్వయంగా సమర్పించేందు(Submit Self)కు అల్లు అర్జున్ కోర్టుకు వచ్చారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.50 వేల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. సాక్షులను ప్రభావితం చేయవద్ధని, కేసును ప్రభావితం చేసేలా మాట్లాడవద్దని స్పష్టం చేసింది. అలాగే రెండు నెలల పాటు ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని నిర్దేశించింది.

Advertisement

Next Story

Most Viewed