Rain alert: హైదరాబాద్ నగరంలో దంచికొడుతున్న భారీ వర్షం

by Mahesh |
Rain alert: హైదరాబాద్ నగరంలో దంచికొడుతున్న భారీ వర్షం
X

దిశ, వెబ్ డెస్క్: వారం రోజులుగా నగర ప్రజలకు వర్షం నుంచి ఉపశమనం లభించింది. ఈ క్రమంలో ఆదివారం నగర వ్యాప్తంగా ఎండలు మండిపోయాయి. దీంతో ఇక వర్షాలు తగ్గుముఖం పట్టినట్లేనని నగర ప్రజలు భావించారు. కానీ సోమవారం తెల్లవారుజామున నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం దంచి కొట్టింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి తెలంగాణ రాష్ట్రాని ఉపరితల ద్రోణి కమ్మేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇందులో భాగంగా హైదరాబాద్ లో తెల్లవారు జామును 3.30 గంటలకు ప్రారంభమైన వర్షం 7 గంటలకు వరకు దంచి కొట్టింది. ముఖ్యంగా అమీర్పేట్, యూసఫ్ గూడ, సుచిత్ర, బోయిన్ పల్లి, మాదాపూర్, జూబ్లీహిల్స్, అంబర్ పేట, నారాయణగూడ, ట్యాంక్ బండ్, ఖైరతాబాద్, వనస్థలిపురం, ఎల్బీనగర్, బీఎన్ రెడ్డి, హయత్ నగర్, దిల్‌షుక్ నగర్, ఉప్పల్, రామంతపూర్, బోడుప్పల్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ఉదయాన్నే ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

Advertisement

Next Story