- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణకు భారీ వర్షసూచన.. నేడు ఈ జిల్లాల్లో..
దిశ, వెబ్ డెస్క్: బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ప్రభావం తెలంగాణ జిల్లాలపై కూడా పడింది. హైదరాబాద్ లో అర్థరాత్రి నుంచి వాతావరణం మారగా.. తెల్లవారుజాము నుంచి ఆకాశం మేఘావృతమై పలుచోట్ల జల్లులు, అక్కడక్కడా భారీ వర్షం కురిసింది. స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులకు వెళ్లే సమయం కావడంతో.. వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
నేడు రాష్ట్రంలోని మెదక్, మేడ్చల్ మల్కాజ్ గిరి, సంగారెడ్డి, సిద్ధిపేట జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. హైదరాబాద్ లోనూ భారీ వర్షం కురుస్తుందని అంచనా వేసింది. ఈ క్రమంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. మరోవైపు ఏపీలోని వైఎస్సార్, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఒక్కరోజులోనే 20 సెంటీమీటర్ల వర్షం కురుస్తుందని వాతావరణశాఖ హెచ్చరించడంతో.. రెండ్రోజులు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.