తెలంగాణలో కొట్టుకుపోయిన రైల్వేట్రాక్.. రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం

by Mahesh |
తెలంగాణలో కొట్టుకుపోయిన రైల్వేట్రాక్.. రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో గత మూడు రోజులు వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో వాగులు వంకలు, చెరువులు, పొంగిపోర్లుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారు జామును కురిసిన భారీ వర్షానికి.. మహబూబాబాద్ జిల్లా ఇంటికన్నె దగ్గర రైల్వే ట్రాక్ కిద్ద కట్ట పూర్తిగా 20 మీటర్ల పొడవు కొట్టుకు పోయింది. దీంతో సికింద్రాబాద్, విజయవాడ మధ్య నడిచే అనేక రైళ్లపై తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం కూడా వరద ప్రవాహం కొనసాగుతుండటం, ఎడతెరిపి లేకుండా వర్షాలు కువరడంతో రైల్వేట్రాక్‌ పునరుద్ధరణ పనులకు అంతరాయం ఏర్పడుతుంది. దీంతో వరద ధాటికి పూర్తిగా రైల్వే ట్రాక్ కింద కట్ట కొట్టుకుపోవడంతో ట్రాట్ గాలిలో వేలాడుతుంది.

దీంతో ఢిల్లీ నుంచి సౌత్‌ మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వరద తగ్గితే వెంటనే ట్రాక్ మరమ్మతుల చేపడతామని రైల్వే అధికారులు తెలిపారు. కాగా ట్రాక్ కొట్టుకుపోయిందని తెలిసిన వెంటనే రైల్వే అధికారులు అప్రమత్తం కావడంతో ఎక్కడి రైళ్లు అక్కడ నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే నిన్న రాత్రి నుంచి రైల్వే స్టేషన్లలో రైళ్లు నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో స్థానిక యువకులు, రాజకీయ నేతలు భోజనాలు సిద్ధం చేసి.. ప్రయాణీకులకు అందిస్తున్నారు. కాగా ఈ మార్గంలో ట్రాక్ పునరుద్దరించే వరకు పలు రైళ్లను రూట్ మార్చినట్లు రైల్వే అధికారులు ప్రకటించగా.. పదుల సంఖ్యలో రైళ్లు రద్దు చేశారు.

Advertisement

Next Story

Most Viewed